పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలతో పాటు స్క్రీన్ ప్లేను అందించారు. అంతే కాకుండా త్రివిక్రమ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉన్నారు. పవన్ త్రివిక్రమ్ ల మధ్య ఎలాంటి బాండ్ ఉంటుందో ప్రత్యేకండా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు సినిమాల విషయంలోనూ రాజకీయాల విషయంలోనూ త్రివిక్రమ్ సలహాలను పవన్ ఫాలో అవుతూ ఉంటారు.
Advertisement
భీమ్లా నాయక్ సినిమా కథను కూడా పవన్ తో చేయాలనే ఆలోచన ముందుగా త్రివిక్రమ్ కే వచ్చిందట. అంతే కాకుండా త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ కోసం మరో రెండు రీమేక్ సినిమాలను కూడా రెడీ గా ఉంచారని టాక్ వినిపిస్తోంది. తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన తేరీ సినిమాతో పాటూ మరో తమిళ సినిమా వినోదల సితం…అనే సినిమాలను పవన్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట. అయితే దీనికి సంబంధించిన వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై నెట్టింట ఫైర్ అవుతున్నారు.
Advertisement
తమ హీరోను రీమేక్ లకు పరిమితం చేస్తున్నారని మండి పడుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మంచి కోసమే త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారని మర్చిపోతన్నారు. పవన్ కల్యాణ్ సినిమాలతో పాటూ రాజకీయాలలోనూ చురుకుగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాంతో పవన్ 40 నుండి 50 రోజుల్లో షూటింగ్ పూర్తవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. కాబట్టి దానికోసం రీమేక్ లు చేయడమే బెటర్ అని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా రాజకీయాల్లో ఉన్న పవన్ కోసం పొలిటికల్ స్టఫ్ ఉండే సినిమాలను వెతికిపెడుతూ త్రివిక్రమ్ మంచి చేస్తున్నారు.