pawan kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తీసుకువచ్చిన మూవీ సుస్వాగతం. ఈ మూవీ 1998 లో జనవరి 1న రిలీజ్ అయింది. సరిగ్గా ఈ మూవీ రిలీజ్ అయి ఈరోజుకు 25 సంవత్సరాలు. అలాంటి సినిమా అప్పట్లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. మరి ఈ మూవీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అదుర్స్ అని చెప్పవచ్చు. తన ఫ్యామిలీలో ఏం జరుగుతున్న పట్టించుకోకుండా ప్రేమ పేరుతో పిచ్చోళ్ళ మాదిరిగా తిరిగే వాళ్లకు ఈ మూవీ మంచి లెసన్ అని చెప్పవచ్చు. ఇందులో రఘువరన్ యాక్టింగ్ వేరే లెవెల్. ముందుగా ఈ మూవీని తమిళంలో విజయ్ హీరోగా “లవ్ టుడే” పేరుతో తీశారు అక్కడ సూపర్ హిట్ తెలుగులో ఆర్ పి చౌదరి రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ శుభాకాంక్షలు మూవీ తీసిన భీమనేని శ్రీనివాసరావు దీనికి కరెక్ట్ అనుకొని ఆయనను పిలిపించి చేయమన్నారు.
Advertisement
also read:kajal: కాజల్ రీ ఎంట్రీ:ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతుందో తెలుసా..?
Advertisement
చివరికి ఈ మూవీ గురించి చిరంజీవికి చెప్పారు, ఆయన ఓకే చెప్పడంతో పవన్ కు కథ వినిపించారు ఆయన కూడా ఓకే చెప్పారు. ఇక ముందుగా ఈ సినిమాలో రాశి హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో దేవయానిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక తమిళంలో చేసిన రఘువరన్ తెలుగులో కూడా చేశారు. ఈ చిత్రానికి చింతపల్లి మాటలు రాయగా , ఎస్ ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ అందించారు . ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది సెప్టెంబర్ లో పవన్ పుట్టినరోజు సందర్భంగా సుస్వాగతం టైటిల్ ని విడుదల చేశారు. ఈ చిత్ర మేజర్ పార్ట్ షూటింగ్ విశాఖలో తీశారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో మిగతాది కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో రఘువరన్ చితి వద్ద ఏడ్చే సీన్ కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజులు ప్రిపేర్ అయ్యాడట.
ఒక రోజంతా పస్తులు ఉండటంతో నీరసం ఆవహించింది సీన్ బాగా వచ్చింది దీంతో అందరూ అభినందించారట. 1998 జనవరి 1న రిలీజ్ అయిన ఈ మూవీ యువతను ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దేవయాని క్యారెక్టర్ బాగా సూట్ అయింది. ఇందులో ప్రకాష్ రాజు శాడిస్ట్ గా అదరగొట్టారు. అప్పటివరకు విలన్ పాత్రలు చేసిన రఘువరన్ ఈ స్నేహంగా ఉండే తండ్రి పాత్రలో బాగా నటించారు. ఇక ఈ చిత్రంలో పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. 45 సెంటర్లలో 50 రోజులు, 9 సెంటర్లలో వంద రోజులు ఆడి మొత్తం 6 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
also read: