Home » పవన్ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” మూవీని అంత పెట్టి తీస్తే అది వచ్చింది..!

పవన్ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” మూవీని అంత పెట్టి తీస్తే అది వచ్చింది..!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరికి కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న పవన్ “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” అనే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీలో సుప్రియ, పవన్ సరసన హీరోయిన్గా నటించగా… ఈవివి సత్యనారాయణ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

Advertisement

గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించగా… కోటి ఈ మూవీకి సంగీతం అందించాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయిన పవన్ నటించిన మొదటి సినిమా కావడం… ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ దర్శకుడు అయినటువంటి ఈవివి సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడం… అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించడంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా 11 అక్టోబర్ 1996వ సంవత్సరం భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకోవడంతో మామూలు కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీని ఆ సమయంలోనే 2 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు.

2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 3 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది.

Visitors Are Also Reading