నటుడు వీకే నరేష్ నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇటు టాలీవుడ్ లో అటు కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింంది. నరేష్ పవిత్ర లోకేష్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నరేష్ తెలుగులో ప్రముఖ నటుడు కాగా పవిత్ర కన్నడ చిత్ర పరిశ్రమకు భాగా సుపరిచితురాలు. పవిత్రలోకేష్ తండ్రి కన్నడలో నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పవిత్రలోకేష్ కూడా మొదట కన్నడ చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అంతే కాకుండా పవిత్ర మొదట కన్నడ నటుడు, రచయిత సుచేంద్ర ప్రసాద్ తో రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా గత కొద్దిరోజులుగా పవిత్రలోకేష్ నరేష్ లు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు రావడంతో తాజాగా సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశాడు. పవిత్రలోకేష్ తనతో పెళ్లైన తొలినాళ్లలో భాగానే ఉందని కానీ పిల్లలు పుట్టిన తరవాత వదిలేసి వెళ్లిపోయిందని అన్నారు.
Advertisement
ఆమెది కాపురాలు కూల్చేసే బుద్ది అని ఒక నటిగా అలాంటి మనస్థత్వం మంచిది కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను చాలా సార్లు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసానని కానీ ఆమె తీరులో మార్పు రాలేదని అన్నారు. పవిత్ర లోకేష్ వదిలి వెళ్లిన తరవాత చాలా హ్యాపీగా ఉన్నానన ఒంటరి జీవితమే బాగుందని కామెంట్ చేశారు. పవిత్ర లోకేష్ ది దోచుకునే మనస్థత్వం అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
లగ్జరీ జీవితాన్ని గడపడమే పవిత్ర లోకేష్ లక్ష్యమని డబ్బులు లేని కారణంగానే తానను విడిచి వెళ్లిపోయిందని సుచేంద్ర ఆరోపించారు. తాను కొట్టాను తిట్టానని చెబుతూ నిందలు వేస్తోంది. ఒకవేళ అది నిజమైనా వదిలేసి నరేష్ వద్దకు వెళ్లడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు.పవిత్ర మనస్తత్వం తనకు భాగా తెలుసు అని చేతికి డబ్బు రాగేనే నరేష్ ను వదిలేస్తుందన్నారు. ఆరు నెలల్లో పవిత్రలోకేష్ నరేష్ ను వదిలేస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.