గత కొంతకాలంగా పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవల వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరి టాపిక్ తెరపైకి వచ్చింది. పవిత్ర లోకేష్, నరేష్ ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు రిలీజ్ చేసిన వీడియో ఫేక్ అని ఆ తర్వాత తెలిసింది.
read also : Poorna : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ… ఫోటోలు వైరల్
Advertisement
ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా పవిత్ర, నరేష్ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యే నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలోని ఏలూరుపాడుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరిని చూసేందుకు జనం ఏగబడ్డారు. ఏలూరుపాడు, ఇది నరేష్ సొంతగ్రామం. నరేష్ బంధువుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యేందుకు నరేష్ పవిత్రతో కలిసి వెళ్లారు.
Advertisement
READ ALSO : Twitter Logo : ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్
ఇద్దరు కలిసి ఆ గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, ఇంకా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలా నరేష్, పవిత్ర సడన్ గా తమ వీధుల్లో దర్శనం ఇవ్వడంతో అక్కడున్న జనం అంతా వారిని చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవు తున్నాయి.
read also : పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన జాన్వి