Home » నరేష్ ఇష్యూతో పెరిగిన పవిత్ర లోకేష్ రెమ్యూనరేషన్… అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరి అంత ఎక్కువ..!

నరేష్ ఇష్యూతో పెరిగిన పవిత్ర లోకేష్ రెమ్యూనరేషన్… అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరి అంత ఎక్కువ..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటీమణుల్లో పవిత్ర లోకేష్ ఒకరు. ఇప్పటికే ఈనటి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ నటి కొంతకాలం క్రితం నుండి టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తో కలిసి ఉంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా వీరిద్దరూ చెప్పేశారు.

Advertisement

దానితో ఒక్కసారిగా ఈ నటి గురించి సోషల్ మీడియాలో… డిజిటల్ మీడియాలో వార్తలు గుప్పుమని వచ్చేసాయి. దానితో అప్పటివరకు ఈనటి గురించి పెద్దగా తెలియని వారికి కూడా ప్రస్తుతం తెలిసిపోయింది. దానితో ఇంతకు ముందటి కంటే ఇప్పుడు ఈ నటికి వరుసగా సినిమా ఆఫర్లు దక్కుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈనటి తన లవర్ అయినటువంటి నరేష్ తో కలిసి “మళ్ళీ పెళ్లి” అనే సినిమాలో నటించింది. వీరిద్దరూ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.

Advertisement

ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటి రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే … నరేష్ ఇష్యూ కు ముందు అంతగా ఫేమస్ కాని ఈ నటి ఒక్కో రోజు కాల్ షీట్ కు 50 వేల రూపాయల వరకు చార్జ్ చేసేదట. కాకపోతే నరేష్ తో ఇష్యూ తర్వాత ఈనటి క్రేజ్ అమాంతం పెరిగిపోవడం… అలాగే వరుస సినిమా అవకాశాలు వస్తున్నాడంట ఇప్పుడు ఈ నటి ఒక్కో రోజు కాల్ షీట్ కి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందట. అలా పవిత్ర తన రెమ్యూనరేషన్ ని అమాంతం డబల్ చేసిందట.

Visitors Are Also Reading