Home » చరణ్ కి పాప పుట్టిందని.. ఆనందంతో పవన్ కళ్యాణ్ ఏం చేసారు అంటే..?

చరణ్ కి పాప పుట్టిందని.. ఆనందంతో పవన్ కళ్యాణ్ ఏం చేసారు అంటే..?

by Sravya
Ad

మెగాస్టార్ రామ్ చరణ్ ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పుట్టిన పాపని చూసేందుకు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. చిరంజీవి తో పాటుగా అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ ఉపాసనలకి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో అటు పెద్ద పెద్ద హీరోలు ఇతర నటులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.

Advertisement

అయితే అందరూ శుభాకాంక్షలు తెలిపారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి విజయ యాత్రలో ఉండడంతో ఆసుపత్రికి రాలేదు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపరా.. తెలుపుతారా అని అంతా అనుకున్నారు. అయితే ఉదయం నుండి పవన్ కళ్యాణ్ నుండి శుభాకాంక్షలు ట్వీట్ రాకపోవడంతో అసలు ట్విట్ చేస్తారా లేదా అని ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూసారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ట్వీట్ ని తాజాగా పోస్ట్ చేశారు.

Advertisement

ఇక వివరాలు లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ ఉపాసన, రామ్ చరణ్ కి అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్ ని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ రీట్వీట్ సంబరాలు జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర లో బిజీగా ఉండడంతో పాపని చూడడానికి రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే తను దగ్గర లేకపోయినా ఉపాసన డెలివరీ డేట్ తెలుసు కనుక పాప మెడలో తన తరపున వేయవలసిన బంగారం చైన్ ని ముందే ఇచ్చేశారు.

చాలా రోజుల క్రితమే ఈ గోల్డ్ చైన్ ని పవన్ కళ్యాణ్ చేయించారు. డెలివరీ రోజు అందేటట్టు ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ ని చూసి రామ్ చరణ్ ఉపాసన సంతోషించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కుటుంబం అంటే ఇలానే ఉండాలని సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Also read:

రామ్ చరణ్ కూతురి ఫోటోలు లీక్.. ఎవరి పోలికలు అంటే..?

సంఖ్యా శాస్త్రం ప్రకారం రామ్ చరణ్ కూతురి జాతకం ఎలా ఉండనుంది..? మంచిదేనా..?

నగ్మా చేసిన పనికి కోపంతో శోభన్ బాబు..నీ ఆస్తి విలువ నా బాత్రూమ్ ఖరీదు అంత ఉండదంటూ..!

Visitors Are Also Reading