నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ అద్భుతమైన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన వారిలో మీకెరెన్ కూడా ఒకరు. ప్రత్యేకించి 246 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ కాపాడుకోవడంలో మీకెరెన్ చాలా సపోర్ట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా కీలక బ్యాటర్ అయినా మార్క్రమ్ ను మీకెరెన్ క్లీన్ బౌల్డ్ చేసిన తీరు చూడాలి అద్భుతమని అంతే. మార్క్రమ్ తో పాటు బ్యాట్ తోను రాణించగల మార్కో జాన్సన్ ఓ వికెట్ తీశాడు. మొత్తం 9 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
అయితే మీకెరెన్ ది ఓ ఇన్స్పైరింగ్ స్టొరీ. మన క్రికెటర్ లాగా నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో క్రికెటర్లకు అంతగా డబ్బులు రావు. వారికి మ్యాచులు లేని సమయంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలా మీకెరెన్ కూడా ఓ ఫుడ్ డెలివరీ బాయ్. 2020లో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. అప్పుడు క్రికిన్ఫో ఓ ట్వీట్ చేసింది.
Advertisement
Advertisement
అన్ని జరుగి ఉంటే ఇవాళ టి20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతూ ఉండేదని దానికి స్పందించిన మీకెరెన్… అవును ఈ టైం లో క్రికెట్ ఆడుతూ ఉండాల్సిన నేను ఇప్పుడు ఆ టోర్నీ పోస్ట్ పోన్ అవడంతో ఫుడ్ డెలివరీ చేసుకుంటూ ఈ వింటర్ లో కుటుంబాన్ని పోషించేందుకు ప్రయత్నిస్తున్నానని ట్వీట్ చేశాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద మ్యాచులో నెదర్లాండ్స్ గెలిచిన తర్వాత మళ్ళీ ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అప్పుడు ట్రీట్ చేసిన క్రికిన్ఫోనే ఇప్పుడు మళ్లీ ట్వీట్ చేసింది. మీకెరెన్ 2020లో ఫుడ్ డెలివరీ చేశాడు. ఇప్పుడు 2023లో చరిత్రనే సృష్టించాడని ట్వీట్ చేసింది. నిజంగానే మీకెరెన్ ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టొరీ.
ఇవి కూడా చదవండి
- Roja Mahesh Babu : మహేష్ బాబుతో సినిమా చేస్తా.. ఆ పాత్రలోనే – రోజా
- చిరంజీవిని తిట్టినందుకు కొడాలి నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్ !
- కొన్నేళ్ల తర్వాత రెండో పెళ్లిపై ఆలోచిస్తా: రేణు దేశాయ్