ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ కి ఇండియా యువ బ్యాటర్ రజత్ పటిదార్ దూరమయ్యారు. బుధవారం సాయంత్రం రజత్ గాయ పడ్డాడని, ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. గత మూడు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయనప్పటికీ రజత్ ధర్మశాల టెస్ట్ లో కొనసాగుతాడని ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో రజత్ కొనసాగుతున్నాడని జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పారు పరుగులు సాధించినప్పటికీ అతనికి ఎంతో టాలెంట్ ఉందని రోహిత్ శర్మ అన్నారు.
Advertisement
రజత్ కి అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు కూడా యువ క్రికెటర్ కి మద్దతుని ఇచ్చారు దీంతో రజత్ జట్టులో కొనసాగుతాడని అందరూ అనుకున్నారు. అయితే మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నా టైం లో రజత్ పటిదార్ జట్టుకు దూరమయ్యాడని బీసీసీఐ అంది. అతను దూరం అవడానికి గాయం ఒకటే కారణం కాదట.
Advertisement
అతను అనారోగ్యం తో ఉన్నాడని బీసీసీఏ చెప్పింది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో రజత్ కి ఎడమ చీలమండకు గాయమైంది. అంతే కాకుండా ఈరోజు ఉదయం గొంతు నొప్పి తో బాధపడ్డాడట అందుకని ఐదవ టెస్ట్ కి అతను అందుబాటులో లేడని బీసీసీఐ చెప్పింది. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు వేటు వేయడానికి ముందే నిర్ణయించారని గాయం అనారోగ్యమని సాకులు అంటున్నారని మండిపడుతున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!