Home » “ఎఫ్ -3” సినిమా ఓ స్టుప్పిడ్ కథ…దీనికంటే ఆ సినిమా బెటర్ అంటూ పరుచూరి సంచలన వ్యాఖ్యలు…!

“ఎఫ్ -3” సినిమా ఓ స్టుప్పిడ్ కథ…దీనికంటే ఆ సినిమా బెటర్ అంటూ పరుచూరి సంచలన వ్యాఖ్యలు…!

by AJAY
Ad

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ -2 సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా థియేటర్ లో నవ్వులు పోయించింది. భార్యల వల్ల భర్తలకు వచ్చే ఫ్రస్టేషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తమన్నా మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో దీనికి సీక్వెల్ గా అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించాడు.

Advertisement

కానీ ఈ సినిమా ఎఫ్ 3 రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా పై రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు కార్యక్రమం ద్వారా తన అభప్రాయాన్ని వెల్లడించారు. ఎఫ్ -2 సినిమాలో భార్య భర్తల పెత్తనం అనే కాన్సెప్ట్ భాగా కనెక్ట్ అయ్యిందని అన్నారు.

Advertisement

ఈ సినిమా అనిల్ కు మంచి గుర్తింపు వచ్చేలా చేసిందని చెప్పారు. కానీ రీసెంట్ గా తాను ఎఫ్ 3 చూశానని గతం లో తాము శ్రీ కట్న లీలలు సినిమాలో చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో చేశారనే అనుమానం కలిగింది అన్నారు. మురళి శర్మ కొడుకు గా వెంకటేష్ ను చూపించడం సెట్ కాలేదు అన్నారు.

మున్నాకి మీసాలు సహా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్ లు అర్థం పర్థం లేనట్లు అనిపించిందని అన్నారు. వెంకటేష్ కాస్త లాజిక్ లేకపోయినా ఒప్పుకోడు కానీ ఈ పాత్రను ఎలా ఓకే చేశాడో అంటూ వ్యాఖ్యానించారు. హోటల్ నడుపుతున్న ఇంట్లోని అమ్మాయి మెహ్రీన్ మరో ఇంట్లో పనిచేయడం లాజిక్ లేదని అన్నారు. అంతే కాకుండా లాస్ట్ 20 నిమిషాలే సినిమా ను బతికించాయని అన్నారు.

Visitors Are Also Reading