Home » ముఖ్యమంత్రి కుర్చీపై బాలయ్య…నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త…!

ముఖ్యమంత్రి కుర్చీపై బాలయ్య…నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త…!

by AJAY
Ad

టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకులుగా గుర్తింపు సంపాదించిన వారిలో పరుశురామ్ కూడా ఒకరు. పరుశురామ్ విజయ్ దేవరకొండ హీరోగా గీతగోవిందం సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఈ సినిమాతోనే పరుశురామ్ క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పరశురామ్ మహేష్ బాబు కాంబినేషన్ లో సర్కారు వారి పాట సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు పరశురామ్ బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సర్కార్ వారి పాట సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఓ సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మీ దునియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Advertisement

Balakrishna

Balakrishna

నిజానికి బాలయ్యను రియల్ లైఫ్ లో కూడా సీఎం కుర్చీపై చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మొదట సినిమా ద్వారా మాత్రం ఆ కోరిక తీరబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading