Home » Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

by Bunty
Ad

టీమిండియా టి20, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో తన ప్రదర్శన కనబరిచి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ స్టార్ క్రికెటర్. బౌలింగ్, ఫీలింగ్ అలాగే హార్డ్ హిoటింగ్ చేయగల సమర్థుడు హార్దిక్ పాండ్యా. టీమిండియా చరిత్రలో కపిల్ దేవ్ తర్వాత… అంతటి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అనే చెప్పాలి. బ్యాటింగ్లో అలాగే బౌలింగ్లో చాలా బాగా రాణిస్తున్నాడు హార్దిక్ పాండ్యా.

Advertisement

ఈ తరుణంలోనే ఇటీవల కాలంలో టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఫైనల్ చేసింది బీసీసీఐ పాలకమండలి. ఇక అటు… గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కూడా పాండ్యా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ను ఒకసారి ఛాంపియన్ గా నిలిపిన హార్దిక్ పాండ్యా… మొన్న రన్నరప్ గా నిలిపాడు. ఇదంతా పక్కకు పెడితే… హార్దిక్ పాండ్యా వివాహ వేడుకలో చోటుచేసుకున్న ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా సమయంలో నటి నటాషా ను పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా… ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన అంటే ప్రేమికుల రోజున సంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నాడు.

Advertisement

ఈ తరుణంలోనే వారి ఇంటి ఆచారం ప్రకారం… పాండ్య వదినమ్మ.. అంటే కృణాల్ పాండ్యా భార్య… హార్దిక్ పాండ్యా యొక్క షూ దొంగిలించింది. 5 లక్షలు ఇస్తేనే ఆ షూ ఇస్తానని.. కృనాల్ పాండ్యా భార్య ఆటపట్టించింది. రూ. లక్షలు ఇస్తానని హార్దిక్ పాండ్యా ఒప్పుకోవడంతో… ఆమె షూ ఇచ్చేసింది. అయితే… ఇదంతా వారి కుటుంబ ఆచారం ప్రకారం… ప్రతి పెళ్లిలో జరుగుతుందట. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, నటి నటాషా ను గతంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న పాండ్యా.. ఓ బిడ్డకు కూడా జన్మనించారు.

ఇవి కూడా చదవండి

Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్‌ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్‌ పనికిరారు ?

గత 10 ఏళ్లుగా టీమిండియా.. ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీలను ఎందుకు గెలవడం లేదు ?

ODI World Cup 2023 : ఆ రెండు ఇండియా పిచ్‌ లంటే వణికిపోతున్న పాక్‌..? కారణం ఇదేనా..?

Visitors Are Also Reading