ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దాంతో ఈ సినిమాలలో నటిస్తున్న హీరోలను పాన్ ఇండియా స్టార్స్ అని పిలవడం మొదలయ్యింది. ముఖ్యంగా బాహుబలి సినిమాతోనే ఆ ట్రెండ్ మొదలయ్యింది. మొదటగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్నాయి. ఇతర ఇండస్ట్రీలకు చెందిన దర్శకనిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు చేస్తున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే టాలీవుడ్ లో నైన్టీస్ లో కూడా ఓ పాన్ ఇండియా స్టార్ ఉన్నారు. నైన్టీస్ లో టాలీవుడ్ లో చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు స్టార్ హీరోలుగా రాణించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో కూడా ఒక పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు. అప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున. గీతాంజలి సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
1989లో విడుదలైన గీతాంజలి తెలుగుతో పాటూ తమిళ్ లో విడుదల కాగా అక్కడ కూడా నాగ్ కు క్రేజ్ వచ్చింది. అదే సినిమాను కన్నడలో విడుదల చేయగా మంచి విజయం సాధించింది. అదే విధంగా ఆ తరవాత వచ్చిన శివ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది.
హిందీలో టీవీలో శివ ప్రసారం కాగా అత్యధిక వ్యూవర్ షిప్ వచ్చిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా నాగార్జున హీరోగా నటించిన మాస్ సినిమాను సైతం హిందీలో డబ్ చేయగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలా కింగ్ నాగార్జున నలుగురు హీరోలలో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నారు.