Home » పాలకుర్తి MLA యశస్వినీ భర్త ఎవరో తెలుసా? 26 ఏళ్లకే MLA గా గెలిచి..

పాలకుర్తి MLA యశస్వినీ భర్త ఎవరో తెలుసా? 26 ఏళ్లకే MLA గా గెలిచి..

by Sravya
Ad

ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో యశస్విని చేతిలో ఓడిపోయారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి గెలిచారు. ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని 26 ఏళ్ల యశశ్విని ఓడించారు. ఆమె వయసు కేవలం 26 ఏళ్లు. రాజకీయంగా కూడా ఎటువంటి అనుభవం లేదు అనూహ్యంగా మొదటి సారి ఎన్నికల బరి లో నిలిచి విజయాన్ని రెడ్డి అందుకున్నారు.

palakurthi-mla

Advertisement

 

ఈమె ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పుట్టారు. హైదరాబాదులో చదువుకున్నారు. యశస్విని పెళ్లి తర్వాత అమెరికాకి వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని తీసుకున్నారు యశస్విని అత్త ఝాన్సీ రెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. అయితే ఝాన్సీ కుటుంబం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి తో పాటుగా తెలంగాణలో వివిధ ప్రాంతాలలో ధార్మిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే అవ్వాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు పాలకుర్తి టికెట్ కోసం ట్రై చేసారు.

Advertisement

Also read:

ఝాన్సీ రెడ్డికి టికెట్ ఖాయమైంది కానీ భారత పౌరసత్వం విషయంలో చిక్కులు వచ్చాయి దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ వ్యూహాన్ని మార్చింది. ఝాన్సీ కి బదులుగా కోడలు యశశ్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ని ఇచ్చారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరి లోకి దిగి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిని ఓడించారు. మొదట యశశ్విని గెలుస్తుందా అనే అనుమానాలు కలిగాయి ఆమె ప్రచారంలో కొంచెం తడబడ్డారు కూడా. జై కాంగ్రెస్ అనబోయి ఆమె జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. దీంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ అయిపోయారు కానీ ఆమె గెలుపుతో అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading