Home » VIRAL VIDEO : ఈ అమ్మాయి అందానికే కేరాఫ్ అడ్రస్…కానీ ఏం పని చేస్తుందో తెలుసా…?

VIRAL VIDEO : ఈ అమ్మాయి అందానికే కేరాఫ్ అడ్రస్…కానీ ఏం పని చేస్తుందో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

సోషల్ మీడియా విప్లవంతో చాలామంది కాస్త టాలెంట్ ఉన్నా సరే సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇక టాలెంట్ మాత్రమే కాకుండా వారిలో ఏదైనా ప్రత్యేకత ఉండి అది కాస్త సోషల్ మీడియాలో పెట్టారంటే రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోవాల్సిందే. అలానే ఇప్పుడు పాకిస్థాన్ కి చెందిన ఓ అమ్మాయి తన అందంతో సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. హీరోయిన్లను మించిన అందం తో ఆ అమ్మాయి ఆకట్టుకుంటూ ఉండడంతో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Pakisthan Ameena

Pakisthan Ameena

నిజానికి ఆ యువతి ఖరీదైన బట్టలు ధరించడం కానీ లేదంటే కెమెరా లో వీడియో ఎడిటింగ్ లు కానీ చేయలేదు. కేవలం ఆమె నవ్వు మరియు అందం అభినాయానికే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఆ అమ్మాయి పేరు అమీనా కాగా పాకిస్థాన్ లోని సంచార జాతులకు చెందిన యువతిగా తెలుస్తోంది. ఆ యువతి పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలో కరాచీ శివార్లలో కుటుంబంతో కలిసి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆమె వయసు 15 సంవత్సరాలు కాగా ఆమె అందం చూసి షాక్ అయిన ఓ వ్యక్తి ఆమె వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అమీనా సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది.

Advertisement

Advertisement

ఇక అమీనా చేసే వీడియోలు డబ్ స్మాష్ మరియు డ్యాన్స్ లకు సంబంధించినవి కూడా కావు … ఆమె వంట కోసం కూరగాయలు కట్ చేయడం అలాగే తన ఇంటి నిర్మాణం కోసం ఇటుకులను మోయడం కానీ అలాంటి వీడియోలే నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమీనా బయోలో కూడా “నాకు ఖరీదైనా దుస్తులు లేవు కానీ నా నవ్వే నాకు అందం” అంటూ కనిపిస్తుంది. నిజానికి అమీనా బయోలో ఏముందో అదే మనకు కనిపిస్తుంది కూడా… దాంతోనే ఎక్కడో కరాచీలో ఉన్న అమీనా అంత ఫేమస్ అయ్యింది.

http://www.instagram.com/reel/CToU_g3D4YE/?utm_medium=copy_link

Also Read: పెళ్లిమండ‌పంలో మంట‌లు…. త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా భోజ‌నం చేస్తున్న అతిథులు !

Visitors Are Also Reading