Home » ఇమ్రాన్ ప్ర‌ధాని అయ్యాకా.. పాక్ ఎంత పెరిగాయో తెలుసా

ఇమ్రాన్ ప్ర‌ధాని అయ్యాకా.. పాక్ ఎంత పెరిగాయో తెలుసా

by Bunty

ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అప్పులు భారీగా పెరిగిపోయాయి. మూడేళ్ల నుంచి వివిధ దేశాల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చుకొని కాలం వెల్ల‌దీస్తోంది. 2019-2020లో పాక్ విదేశాల నుంచి 10.45 బిలియ‌న్ డాల‌ర్ల‌ను అప్పుగా తెచ్చుకున్న‌ది. 2020-2021లో 15.32 బిలియ‌న్ డాల‌ర్ల‌ను అప్పుగా తెచ్చుకొని వినియోగించుకున్న‌ది. రెండేళ్ల కాలంలో మొత్తం 26 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా విదేశీ రుణాల‌ను తెచ్చుకొని వినియోగించుకున్న‌ట్టు పాక్ ఆర్థిక శాఖ స్ప‌ష్టం చేసింది.

మూడేళ్ల కాలంలో 35.1 బిలియ‌న్ డాల‌ర్ల విదేశీరుణాలు తెచ్చుకున్న‌ట్టు నివేదిక‌లు చెబుతున్నాయి. ఇమ్రాన్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు పాక్ విదేశీ రుణాలు 50 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు ఉండేది. ఇమ్రాన్ ఖాన్ అధికాంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ మొత్తం భారీగా పెరిగిపోయింది. దేశ అవ‌స‌రాల కోసం చేసిన అప్పులకు వ‌డ్డీలు క‌ట్టేందుకు ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున ట్యాక్సులు వ‌సూలు చేస్తున్నారు. స‌రైన అభివృద్ది లేక‌పోవ‌డం, నిరుద్యోగ స‌మ‌స్య‌లు, త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న అప్పులు పెరిగిపోయాయి, క‌రోనా మ‌హ‌మ్మారి, స‌రిహ‌ద్దు దేశాల‌తో వైరం, ఉగ్ర‌వాదం పెరిగిపోవ‌డం కూడా ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌వ్వ‌డానికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. 2018లో డాల‌ర్‌తో పాక్ రూపాయి విలువ 123 ఉండ‌గా, 2021లో డాల‌ర్‌తో పాక్ రూపాయి విలువ 177గా ఉన్న‌ది.

Visitors Are Also Reading