గణతంత్రదినోత్సవం సందర్భంగా రీసెంట్ గా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ లో కేవలం సీనియర్ నటి షావుకారు జానకికి మాత్రమే పద్మ అవార్డు దక్కింది. జానకికి కూడా లేటు వయసులో 90 ఏళ్ళు వచ్చాక ఈ అవార్డు దక్కింది. నిజానికి పద్మశ్రీ అవార్డు కు టాలీవుడ్ లో ఎంతోమంది అర్హులు ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం షావుకారు జానకికి అవార్డు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఆశ్చర్యకరం. టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరు కైకాల సత్యనారాయణ 900 కు పైగా సినిమాల్లో నటించి కైకాల సత్యనారాయణ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
Advertisement
Advertisement
కైకాల పౌరాణిక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కలిసి నటించి ఔరా అనిపించారు. అలాంటి కైకాల సత్యనారాయణకు పద్మ పురస్కారం దక్కలేదు. అదేవిధంగా టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు. ఆయన మరణించి చాలాకాలం అవుతుంది. కానీ శోభన్ బాబును సైతం ఇప్పటివరకు పద్మ అవార్డు వరించలేదు.
నిజానికి ఈ అవార్డులను ఇచ్చేదేదో మరణాంతరం కంటే బ్రతికి ఉన్నప్పుడు ఇస్తే అవార్డు అందుకున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా సంతోష పడతారు. కాబట్టి టాలీవుడ్ లో అలాంటి దిగ్గజ నటులను గుర్తించి వారికి సైతం పద్మ అవార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఒకప్పుడు అవార్డుల వెనుక రాజకీయాలు ఉండేవని కామెంట్లు వచ్చేవి… కానీ ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ ప్రముఖులు అవార్డుల విషయంలో కేంద్రాన్ని నిలదీయకపోవడం వల్లే ఇలా జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.