సినిమా ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తే… మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేక అపజయాన్ని అందుకుంటూ ఉంటాయి. కానీ ఎప్పుడూ… అప్పుడు కొన్ని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఆ సినిమాల ద్వారా కొంతమంది హీరోలు ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. అలా మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంతమంది అప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించిన రాని క్రేజ్ ను ఒకే ఒక్క సినిమాతో తెచ్చుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ హీరోలు ఎవరు..? వారు ఏ సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిపోయారు… అనే విషయాలను తెలుసుకుందాం.
Advertisement
చిరంజీవి : ఈ నటుడి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్… ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి… కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందినటువంటి ఖైదీ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 1983 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమా ద్వారా చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకోవడం మాత్రమే కాకుండా ఓవర్ నైట్ లో స్టార్ హీరో క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారు.
Advertisement
నాగార్జున : ఈ నటుడు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే 1990వ సంవత్సరంలో నాగార్జున… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన శివ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ ఒక్క మూవీతో నాగార్జున ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.
జూనియర్ ఎన్టీఆర్ : ఈ నటుడు నిన్ను చూడాలని సినిమాలో ఫుల్ లెన్త్ హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ నటుడు స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఈ మూవీ ఎన్టీఆర్ కు క్రేజ్ ను మాత్రం తీసుకురాలేదు. ఆ తర్వాత వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఎన్టీఆర్ కు మాస్ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ ను తీసుకువచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓవర్ నైట్ లో స్టార్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఈ మూవీలతో పాటు మరికొన్ని మూవీల ద్వారా కూడా కొంతమంది హీరోలు ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారారు.