ప్రతి సినిమాలో కామెడీ ఎంత ప్రాముఖ్యత పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత సీరియస్ గా సినిమా నడుస్తున్నా సరే, సినిమాతో కలిసి పోయి కామెడీ పండించగలిగితే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. అలాంటి సినిమా చూసే ప్రేక్షకుడు కూడా సంతృప్తిగా ఫీల్ అవుతాడు. అయితే.. ఆ కామెడీని పండించే కామెడియన్లకు కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఒక్కోసారి కొన్ని సినిమాలు కామెడీ వల్లే హిట్ అవుతూ ఉంటాయి. సినిమా స్టోరీ మర్చిపోయినా కామెడీ సీన్లని మాత్రం అంత త్వరగా మర్చిపోరు. ఇలా కమెడియన్లు కూడా సినిమా హిట్ అవ్వడంతో కీలక పాత్ర పోషిస్తారు. ఇక మనకి చాలా మంది కమెడియన్స్ తెలిసినా, వారి పర్సనల్ జీవితాలు మాత్రం అందరికీ ఓపెన్ కాదు. చాలా మంది కమెడియన్స్ భార్యలు, పిల్లలు ఎవరు అనేది కూడా బయటకు తెలియవు.
Advertisement
బ్రహ్మానందం:
తెలుగు సినిమా కమెడియన్ల గురించి చెప్పాలంటే ముందు బ్రహ్మానందం తోనే మొదలు పెట్టాలి. ఆయన భార్య పేరు లక్ష్మి. వారికి గౌతమ్, సిద్దు అని ఇద్దరు కుమారులు ఉన్నారు.
సునీల్:
కమెడియన్ సునీల్ శృతి ఇందుకూరి ని వివాహం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొద్దీ రోజులకే ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి దుష్యంత్, కుందన అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పోసాని:
పోసాని కృష్ణ మురళి తమ బంధువుల అమ్మాయి కుసుమ లతను వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
Advertisement
పృథ్వి రాజ్:
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కె కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.
తాగుబోతు రమేష్:
స్వాతి అనే అమ్మాయిని 2015 లో పెళ్లి చేసుకున్నారు తాగుబోతు రమేష్. ప్రస్తుతం తాగుబోతు రమేష్ జబర్దస్త్ షో లో టీం లీడర్ గా ఉన్నారు.
అలీ:
అలీ 1994 లో జుబేదా సుల్తానా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
.ఎమ్ ఎస్ నారాయణ:
.ఎమ్ ఎస్ నారాయణ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కల ప్రపూర్ణ అనే అమ్మాయిని .ఎమ్ ఎస్ నారాయణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆటో రామ్ ప్రసాద్:
ఆటో పంచ్ లతో పాపులర్ అయిన రామ్ ప్రసాద్ తన చిన్నప్పటి ఫ్రెండ్ అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
మరిన్ని ముఖ్య వార్తలు:
దిల్ రాజు రెండవ భార్య తేజస్విని బ్యాక్ గ్రౌండ్ ఇదే…!
SRH లోకి తిలక్ వర్మ.. కావ్యా పాప బిగ్ స్కెచ్ ?
100కు పైగా సినిమాలు చేసిన తెలుగింటి హీరోయిన్…చికిత్సకు డబ్బులు లేక చివరకు….!