రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ను సొంతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ కు పంపాలనుకున్న ఇండియన్ సినిమాలు మరియు ఆస్కార్ బరిలో నిలిచిన ఇండియన్ సినిమాల గురించి జనాలు చర్చించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన సోషల్ మీడియాలో ఆస్కార్ కు పంపాలనుకున్న ఓ సినిమా ఏ రేంజ్ లో ఉందో సెటైరికల్ గా చెప్పారు.
ALSO READ : “బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను బదులుకున్న స్టార్ కమెడియన్!
Advertisement
ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..యండమూరి తన సోషల్ మీడియాలో…. “హీరోయిన్ డాక్టర్. దేశ సరిహద్దు లో టెంట్. ఎదురుగా గాయాలతో సైనికుడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు..! కానీ టెంట్ లో కరెంట్ లేదు…” రచయిత చెబుతొంటే నిర్మాత వింటున్నాడు. “…ఏమి చేయాలో అర్థం కాక హీరోయిన్ సైనికుడి వైపు నిస్సహాయంగా చూస్తుండగా, అకస్మాత్తుగా వెలుగు వస్తుంది. ఆశ్చర్యపోయి చూస్తే, పక్కనే అసిస్టెంట్ రోష్నీ తన వంటి మీద వస్త్రాలని ఒక్కొక్కటే తీసి అగ్గిపెట్టెతో కాల్చటం కనపడుతుంది.
Advertisement
ఆ వెలుగులో ఆపరేషన్ మొదలు పెడుతుంది. రోష్నీ వంటిపై ఆఖరి వస్త్రం ఆఖరి చివర కాలటం పూర్తయ్యేసరికి ఆఖరి కుట్టు వేసిన హీరోయిన్, టార్చ్ లైట్ వేసి, ఒక మూల నగ్నంగా ముణగదీసుకొని కూర్చుని ఉన్న రోష్నీని చూసి, ‘ఎంత త్యాగం చేశావు చెల్లీ’ అంటుంది”. దర్శకుడు తలెత్తి చూసేసరికి నిర్మాత కళ్ళలో నీళ్ళు.
1999లో రిలీజయిన ‘జైహింద్’ అనే ఈ సినిమాని ఆస్కార్ కి కూడా పంపాలని దర్శకుడు మనోజ్ కుమార్ ప్రయత్నించాడు కానీ అవలేదు. “టార్చ్‌లైట్ వెలుతురులోనే ఆపరేషన్ చేయ్యొచ్చు కదా. బట్టలు కాల్చటం ఎందుకు” అని ప్రేక్షకులకి అనుమానం రావటంతో ఈ సినిమా వారం కూడా ఆడలేదు. డ్రామాకీ మెలోడ్రామాకీ వెంట్రుక వాసి తేడా ఉంటుది. మెలోడ్రామా సరిగ్గా పండక పోతే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. సినిమాలో రిషి కపూర్ హీరోగా నటించగా మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించింది.
ALSO READ :Naga Chaitanya : శోభితతో నాగచైతన్య డేటింగ్… ఒకే రూమ్ లో అడ్డంగా దొరికిపోయారుగా!