Home » Ori devuda movie review: ఓరి దేవుడా మూవీ రివ్యూ, రేటింగ్..హిట్టు పడ్డట్టేనా..?

Ori devuda movie review: ఓరి దేవుడా మూవీ రివ్యూ, రేటింగ్..హిట్టు పడ్డట్టేనా..?

by Sravanthi
Ad

సినిమా: ఓరి దేవుడా
నటీనటులు :దగ్గుబాటి వెంకటేష్, విశ్వక్ సేన్,మితిలా పాల్కర్ , ఆశ భట్.
దర్శకుడు :అశ్వత్‌ మరిముత్తు.
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి
సంగీతం :లియోన్ జేమ్స్
విడుదల :21 అక్టోబర్, 2022.

అశ్వత్‌ మరిముత్తు డైరెక్షన్ లో విశ్వక్‌సేన్‌ హీరోగా వచ్చిన తాజా చిత్రం “ఓరి దేవుడా”.భారీ అంచనాల నడుమ సినిమాకు సంబంధించి భారీ స్థాయిలో ప్రమోషన్లు కూడా జరిగాయి..మరి సినిమా ఎలా ఉందో చూద్దామా..

Advertisement

కథ: సినిమాలో కథ మొత్తం అజయ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. సినిమాలో ఒక అపరిచితుడు అజయ్ కి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెబుతూ ఉంటాడు. అజయ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటాడు. కోర్టులో ఒక అపరిచితుడు అజయ్ కి ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పాడు. ఆ అపరిచితుడు ఎవరు, అతడికి ప్రతిదీ ఎలా తెలుసు, అజయ్, అను విడాకుల కోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటారు. చివరికి విడాకులు తీసుకున్నారా లేదా అనేది కథగా కొనసాగుతుంది.

also read:SARDAR MOVIE TWITTER REVIEW : మ‌రో హిట్ కొట్టేసిన కార్తీ

Advertisement

విశ్వక్ సేన్ ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలలో బాగా నటించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసుకెళ్ళాడని చెప్పవచ్చు. మిథిలా పాల్కర్ ఆమె తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందని చెప్పవచ్చు. సినిమా మొత్తం భావోద్వేగాలను బాగా పండిస్తుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల్లో బాగా నటించారు. వెంకటేష్, రాహుల్ రామకృష్ణల నటన సినిమాకు హైలెట్ గా చెప్పవచ్చు.

సాంకేతిక విభాగం :
డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు కథను ప్రత్యేకంగా రిఫ్రెష్‌గా డీల్ చేశారు. ప్రతి సన్నివేశం చాలా చక్కగా, ఉత్కంఠభరితంగా తెరకేక్కించారు. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ఇక మూవీ ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది.

విశ్లేషణ : ఓరి దేవుడా సినిమా మాత్రం చాలా వినోదభరితమైన రొమాంటిక్ మూవీ. చిత్రంలో సమయానికి తగ్గట్టు హాస్య సన్నివేశాలు ఉన్నాయి. సినిమా కనీసం ఒక్కసారైనా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:అద్భుతమైన స్క్రీన్ ప్లే, మ్యూజిక్,యాక్టర్స్ నటన
మైనస్ పాయింట్స్ : VFX

రేటింగ్ :3/5

also read:

Visitors Are Also Reading