Home » ఒమిక్రాన్ ముప్పు వారికే ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు..!

ఒమిక్రాన్ ముప్పు వారికే ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు..!

by AJAY
Ad

కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కారణంగా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అయితే డెల్టా కంటే ప్రమాదకారి మాత్రం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ వ్యాప్తి ఎక్కువ ఉండటం వల్ల ఒక్కసారిగా కేసులు పెరిగే ప్రమాదం ఉందని దాంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Omicron veriant

Omicron veriant

ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి. తాజాగా యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఒక మరణం కూడా సంభవించింది. యూకేలో ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ కారణంగానే దేశంలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ఈ వేరియంట్ వ్యాప్తి పై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సామాన్య బరువు ఉన్న వ్యక్తుల కంటే ఊబకాయులకు రెండు రెట్లు ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వేరియంట్ కారణంగా కరోనా సోకిన వారిలో ఊబకాయులే ఐసీయూలో ఎక్కువగా చేరుతున్నట్టు తేలింది.

Advertisement

Advertisement

ఊబకాయుల్లో బిఎంఐ ఎక్కువగా ఉండటంవల్ల ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఊబకాయుల లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఒమిక్రాన్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని కూడా పరిశోధనలు జరిపారు. కెనడా ఇరాన్ మరియు కొస్టరియో దేశాలలోని 400 మంది పిల్లలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా ఊబకాయులైన పిల్లపైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువ ఉందని నిర్ధారణ అయ్యింది.

Visitors Are Also Reading