తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ ఓం నమో వేంకటేశాయ అనే పదం వినని వారుండరు. తప్పకుండా నిత్యం ఓం నమోవేంకటేశాయ అనే పదాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు. ఎస్‌వీబీసీ ఛానెల్‌లో అయితే రోజులో ఆ పదం ఎన్నిసార్లు వస్తుందో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కరేలేదు. ‘ఓం నమోవేంకటాశాయ’ అనే శ్లోకాన్ని ఎవరు పాడారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఓం నమోవేంకటేశాయ అనే పదాన్ని పాడింది మరెవ్వరే కాదు.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ ర్యాప్ సాంగ్ పాడిన కొవ్వూరి వైష్ణవి తల్లి. ఆమె రాజమండ్రిలో పుట్టారు. ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. అక్కడే సెటిల్ అయ్యారు. ఆమె అప్పట్లో ఓం నమోవేంకటేశాయ, భగవతే వాసుదేవాయ ఇలా చాలా పాడినట్టు తెలిపారు.
Advertisement
కొవ్వూరి వైష్ణవి తల్లి పేరు మాధవి. ఆమె 9వ తరగతి చదువుతున్న సమయంలోనే పారుపల్లి రంగనాథ్‌తో కలిసి ఓం నమోవేంకటేశాయ పాడినట్టు వెల్లడించారు. ఇటీవల తన కూతురు భీమ్లానాయక్ ర్యాప్ సాంగ్‌లో థమన్ అవకాశం కల్పించడంపై నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆమె సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అనే సాంగ్ చాలా అద్భుతంగా పాడారు. తిరుపతి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ మాటలు విన్న తరువాత ఓం నమో వేంకటేశాయ అని వినిపించగానే ఇక తొలుత మాధవి గుర్తుకు రాక ఉండదు. ముఖ్యంగా తన కూతురు వైష్ణవికి ఆమెను పాటలు పాడడంలో శిక్షణ ఇచ్చారట. భీమ్లానాయక్ సినిమాలో థమన్ ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఆమె మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.
Also Read :
ఈ రాశుల వారు నేడు తప్పనిసరిగా శని దేవుడిని పూజించాలి
పీసీసీ చీఫ్ పై ఆ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ట్రోలింగ్..!