Telugu News » Blog » పీసీసీ చీఫ్ పై ఆ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ ట్రోలింగ్‌..!

పీసీసీ చీఫ్ పై ఆ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ ట్రోలింగ్‌..!

by Anji
Ads

సెల‌బ్రిటీలు రాజ‌కీయాల్లోకి రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అందులో కొంద‌రైతే సొంత పార్టీ నేత‌ల‌పైనే సెటైర్లు వేయ‌డం, సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం వంటివి చేస్తుంటారు. తాజాగా క‌ర్నాట‌క పీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ పై న‌టి ర‌మ్య చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ర‌మ్య చేసిన ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. డీకే శివ‌కుమార్ పై ఆరోప‌ణ‌లు చేసిన ర‌మ్య కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో త‌న‌కు తెలియ‌దు అన్నారు రాష్ట్ర యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడు మొహ్మ‌ద్ న‌ల‌పాడ్‌. ఆమెకు త‌మ పార్టీలో ఏ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌లేద‌న్నారు. ఏ స‌మ‌స్య‌లు ఉన్నా మాట్లాడాలి త‌ప్ప ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌దు అన్నారు. న‌ల‌పాడ్ మాట‌ల‌పై ర‌మ్య స్పందించారు. బెయిల్ పై ఉన్న వ్య‌క్తి నా పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ట్వీట్ చేసారు ర‌మ్య‌.

Advertisement


క‌న్న‌డ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు ర‌మ్య క‌ర్నాట‌క‌ కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్‌, ప్ర‌చార క‌మిటీ ప్ర‌చార క‌మిటీ చీఫ్ ఎంబీ పాటిల్ మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధంలో చేరారు. పోలీస్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌ను క‌ప్పిపుచ్చ‌డానికి క‌ర్నాట‌క ఉన్న‌త విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వ‌త్ నారాయ‌ణ్‌తో ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించార‌ని పాటిల్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది. ఈ త‌రుణంలో వాటిపై స్పందించిన ర‌మ్య‌.. శివ‌కుమార్ పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌లు ఒక‌రికొక‌రు క‌లుస్తారు. ఫంక్ష‌న్ల‌కు వెళ్తారు. కొంద‌రు కుటుంబాల్లో పెళ్లి చేసుకుంటారు. నాకు చాలా ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని.. @DK శివ‌కుమార్ గ‌ట్టి కాంగ్రెస్ వాది అయిన @MB Patil గురించి ఇలా అన‌డం ఇలా అయితే ఎన్నిక‌ల్లో పార్టీ క‌లిసి పోరాటం చేయ‌గ‌ల‌దా..? అంటూ ర‌మ్య ట్వీట్ చేసింది.

Advertisement

ఈమె చేసిన ఈట్వీట్‌పై కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ర‌మ్య‌ను త‌ప్పు ప‌ట్టారు. ఈ ట్వీట్‌ను అనుస‌రించి పార్టీలో రాజ‌కీయంగా ఎద‌గడానికి స‌హ‌క‌రించిన వ్యక్తిని ర‌మ్య మ‌రిచిపోయారని కాంగ్రెస్ ట్రోల్స్ దాడి చేయ‌డం మొద‌లుపెట్టారు. పార్టీని రూ.8కోట్లు మోసం చేశార‌ని ఆమెపై అభియోగాలు మోపారు. దీంతో ఆమె త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అన్నింటిని కొట్టిపారేసింది. నాకు అవ‌కాశాలిచ్చి నాకు అండ‌గా నిలిచిన వారెవ్వ‌రు అయినా ఉన్నారంటే అది @ రాహుల్ గాంధీ అని మ‌రెవ్వ‌రు నాకు అవ‌కాశాలు ఇచ్చార‌ని చెప్పుకునే వారు అవ‌కాశ‌వాది. ఈ అవ‌కాశ‌వాదులు న‌న్ను వెన్నుపోటు పొడిచి అణ‌చివేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. మీరు టీవీలోచూసేవన్నీ త‌మ‌ను ప్ర‌హ‌స‌నం, మోస‌పూరిత మ‌న‌స్సు అని ర‌మ్య‌ మ‌రో ట్వీట్ చేసారు.

Also Read : 

భార‌త్‌లో టెస్లా కార్ల ప్ర‌య‌త్నాల‌కు బ్రేక్‌..!

Advertisement

మహేష్ బాబుకు సపోర్ట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్…ఏమందంటే…!