Home » ఒకే ఓవర్ లో 6 వికెట్లు… 12 ఏళ్ల కుర్రాడు చరిత్ర

ఒకే ఓవర్ లో 6 వికెట్లు… 12 ఏళ్ల కుర్రాడు చరిత్ర

by Bunty
Ad

క్రికెట్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచ నలుమూలలో ఈ క్రీడాకు ప్రాముఖ్యత బాగా ఉంది. అయితే ఈ క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు… ఎన్నో రికార్డులు, చరిత్రలు నమోదయ్యాయి. ఎవరు సాధించని రికార్డులను… ప్రపంచంలోని నలుమూలలా చాలామంది క్రికెటర్స్ సాధిస్తున్నారు. ఏదో ఒక మూలాన, ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంది.

Advertisement

అయితే తాజాగా… క్రికెటర్ ఏకంగా ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీశాడు. ఒక ఓవర్లో హైట్రీక్ వికెట్లు తీయడమే గగనం అంటే… ఏకంగా మనోడు డబుల్ హైట్రిక్ తీశాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒలివర్ వైట్ హౌస్ అనే క్రికెటర్… ఓకే ఓవర్ లో ఆరు వికెట్లు పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ వైట్ హౌస్ వయస్సు కేవలం 12 సంవత్సరాలు కావడం ఇక్కడ గమనార్హం.

Advertisement

Cricket ball and bail on green grass

ఇంగ్లాండులోని ఓ క్రికెట్ టోర్నమెంట్లో… బ్రొమ్స్ గ్రోవ్ క్రికెట్ క్లబ్ కు వహిస్తున్న ఈ వైట్ హౌస్ అనే కుర్రాడు… కుక్ హీల్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఈ హిస్టరీ సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 6 వికెట్లు తీయడంతో పాటు… మొత్తం రెండు ఓవర్లు వేసి ఎనిమిది వికెట్లు తీశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మరో చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో 6 వికెట్లు తీయడం… ఇలా జరగడం తొలిసారి కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

బాలయ్య కూతురిగా కృతి శెట్టి… షాక్ లో ఫ్యాన్స్ ?

కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా హీరో ?

Visitors Are Also Reading