పితృపక్షం రోజులలో తర్పణ, దాన, శ్రార్ధ, పిండ వంటి కర్మలని ఆచరించడం మంచిది. చాలా మంది ఆచరిస్తూ ఉంటారు కూడా. ఈ సమయంలో పక్షులకి జంతువులకు ఆహారం పెడితే చాలా మంచి జరుగుతుందని చాలామంది పాటిస్తూ ఉంటారు. పితృపక్షం సమయంలో కొన్ని జీవులు ప్రత్యేకమైన సూచనలు ఇస్తూ ఉంటాయి. పూర్వికులు మీ చర్యల కారణంగా సంతోషంగా ఉన్నారా లేదంటే కోప్పడుతున్నారా అనేది జీవులు మనకు చెప్తాయి మనం పెట్టిన ఆహారాన్ని జీవులు తింటే అదృష్టం వస్తుందట.
Advertisement
Advertisement
పితృపక్షంలో ఏ జీవులు అదృష్టాన్ని తీసుకువస్తాయి అనే విషయానికి వచ్చేస్తే.. పూర్వికులు కాకుల రూపంలో ఇంటికి వస్తారట. పూర్వికులకి ఆహారంలో కొంత భాగాన్ని పెట్టినప్పుడు కాకి వచ్చి తిందంటే పూర్వీకులు ఆహారాన్ని అంగీకరించాలని దానికి అర్థం. శ్రార్ధ కర్మ సమయంలో కాకులు వచ్చి ఆహారం తీసుకున్నట్లయితే పూర్వీకులు సంతృప్తి చెందినట్లు అర్థం చేసుకోవాలి. అప్పుడు పురోగతి, శ్రేయస్సు, సంతానం, సంపద పెరుగుతాయి. కుక్కలకి కూడా కొంత ఆహారాన్ని పెడితే మంచిది. నల్ల కుక్కలకి ఆహారం పెడితే, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెందుతుంది. అలానే ఆవుకి ఆహారం పెడితే కూడా పితృదేవతలకి చేరుతాయట.
Also read:
- మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా..? ఈ నూనె రాయండి సరిపోతుంది…!
- బిర్యాని ఆకులతో ఈ సమస్యలన్నీ పోతాయి.. అందుకే రెగ్యులర్ గా తీసుకోండి..!
- డ్రై ఫ్రూప్ట్స్ ని… ఇలా అస్సలు తీసుకోవద్దు.. ఆరోగ్యం పాడవుతుంది..!