Home » “నువ్వేకావాలి” సినిమా హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో…? ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా….?

“నువ్వేకావాలి” సినిమా హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో…? ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా….?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు అందుకున్నంతవరకే లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆఫర్లు తగ్గుముఖం పడితే హీరోయిన్లు కనుమరుగు అవుతుంటారు. వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే అవకాశాలు ఇచ్చేవారు సైతం ఉండరు. కాబట్టి ఇక సినిమా అవకాశాల కోసం ఎదురు చూసి కూడా లాభం లేదని పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో రిచా పల్లాడ్ కూడా ఒకరు.

Advertisement

టాలీవుడ్ లో చాలా సినిమాల్లో రిచా నటించినప్పటికీ నువ్వేకావాలి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో తరుణ్ కు హీరోగా… హీరోయిన్ గా రిచాకు సక్సెస్ మొదలయ్యింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశాడు.

Advertisement

ఈ సినిమాతో రచయితగా త్రివిక్రమ్ ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత తరుణ్ రిచా కాంబినేషన్లో చిరుజల్లు అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా నువ్వే కావాలి అంత పెద్ద రేంజ్ లో హిట్ అవ్వలేకపోయింది. ఈ సినిమా తర్వాత రిచా కు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక 2011లో రిచా హిమాన్షు బజార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత వీరికి ఓ బాబు జన్మించగా రిచా 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ 2020 వరకు రిచా మళ్లీ సినిమాలలో కనిపించలేదు. 2020లో యువర్ హానర్ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ లో కూడా రిచా నటిస్తోంది. మరి ఈ సీనియర్ హీరోయిన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading