రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాలో నటించిన హీరోయిన్ పూజిత ఆ సినిమాలతో ఎంతో కామెడినీ పండించిందనే చెప్పొచ్చు. ఇక తరువాత ఈమె ఏకంగా 135కు పైగా సినిమాలలోనటించిన ఈ అమ్ముడు. తాజాగా సీరియల్‌లో నటిగా పేరు పొందినది పూజిత. ఇలా బుల్లి తెరపై మెరవడంతో మళ్లీ మరొక రెండు సినిమాలలో నటించేందుకు అవకాశాలు వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది పూజిత. అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఈమె. అలా అప్పట్లో లక్ష్మీ పార్వతితో జరిగిన ఓ గొడవ పై ఈ విషయాన్ని తెలిపింది.
Advertisement
అమ్మో అల్లుడు సినిమా షూటింగ్ చేస్తున్న సమయం అది. ఆ సినిమాకు నిర్మాతగా కోనేరు రవీంద్ర వ్యవహరిస్తున్నారు. అందులో నాది చాలా రిచ్‌గల క్యారెక్టర్ అని తెలియజేసినది. అంతేకాకుండా అదే సినిమాలో ఎన్టీఆర్ కు కూడా ఒక గెస్ట్ రోల్ ఉందని తెలుస్తోంది. అందులో ఎన్టీఆర్ భార్యగా నన్ను నటించాలని చెప్పి తీసుకున్నారని గుర్తు చేసింది. ఆ సినిమాలో ఎక్కడ లక్ష్మీపార్వతి పేరు వినిపించలేదు. కానీ సినిమా చివరలో షూటింగ్ ఉన్నప్పుడే ఎన్టీరామారావు చనిపోయారు అని తెలిపింది.
Advertisement
ఆయన మృతి చెందిన తరువాత ఆయనను చూడటానికీ నేను వెళ్లాను అని, ఆయన మరణించిన తరువాత అక్కడ లక్ష్మీపార్వతి ఏమి చేస్తుందో అని తనను చూసానని పూజిత వెల్లడించింది. ఏమిటి ఈమె అలా చేస్తోంది అని అనిపించిందట. ఆమె సినిమాలో ఎలా చేసిందో లక్ష్మీపార్వతి నిజ జీవితంలో కూడా అలాగే చేసిందని వివరించింది. మరణించిన తరువాత లక్ష్మీపార్వతి టీ తాగుతున్నప్పుడు పీవీ నరసింహాగారు వచ్చారు. కానీ టీ కప్పు పక్కన పెట్టి బోరున ఏడ్చేసింది అంటూ వివరించింది.
ఎవరైనా వస్తే గట్టిగా ఏడవాలని ఆమెను చూసిన తరువాత నాకు అర్థమైంది అంటూ తెలిపింది పూజిత. కానీ ఈ విషయాన్ని సినిమాలో తీయగా లక్ష్మీపార్వతి తనపై కేసు పెట్టినట్టు తెలియజేసింది. అలా ఆమె నన్ను ఎన్నోసార్లు బెదిరించింది అని పూజిత చెప్పుకొచ్చింది.