Home » ఆ హీరో కోసం అన్న ఎన్టీఆర్ గంట సేపు ఎండలో నిలబడ్డారా..?

ఆ హీరో కోసం అన్న ఎన్టీఆర్ గంట సేపు ఎండలో నిలబడ్డారా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీ ని టాప్ లెవెల్ కు తీసుకువెళ్లిన హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.. ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సినిమా రంగంతో పాటు రాజకీయ రంగం కూడా పూర్తిగా మారిపోయింది. అలాంటి నట సార్వభౌమ ఎన్టీఆర్ ఓ రోజు ఆ స్టార్ హీరో ని కలవడం కోసం వెళితే ఆయనను గంట సేపు ఎండలో నిలబెట్టారట.. మరి ఆయన ఎవరు అనేది పూర్తి వివరాలు చూద్దాం.. ఎన్టీఆర్ కంటే ముందు టాప్ హీరో గా కొనసాగుతున్న సి.హెచ్.నారాయణరావు మేకప్ రూమ్ లో ఉన్నారు.. అయితే ఆయనను ఎన్టీఆర్ కలవడం కోసం చెన్నైలోని శోభనాచల స్టూడియోకు వచ్చారు. ఆయన మేకప్ రూమ్ లో ఉన్నారని తెలిసి, అక్కడికి వెళ్లారు. తను వచ్చానని చెప్పి లోపలికి కబురు పంపారు ఎన్టీఆర్. ఈ కబురు నారాయణరావు కు చేరింది..

Advertisement

 

దీంతో మళ్లీ ఆ మనిషి బయటకు వచ్చి మేకప్ వేసుకుంటున్నారు వెయిట్ చేయండి అని అన్నారని చెప్పారు. అలాగే అంటూ మేకప్ రూమ్ బయట నిలబడ్డారు ఎన్టీఆర్. అక్కడ నీడ లేక పోవడంతో ఎండలో నిలబడ్డారు ఎన్టీఆర్. అలా గంట సమయం గడిచిపోయింది. మెల్లిగా తీరిగ్గా మేకప్ రూమ్ నుండి బయటకు వచ్చారు నారాయణరావు. వెంటనే ఎన్టీఆర్ వినయంగా ఆయనకు నమస్కారమండి అని చెప్పారు. తెల్లని పంచె జుబ్బా తో ఉన్న ఆయన వంక పరీక్షించి చూసి వెంటనే గుర్తుపట్టి అరే మీరా గుర్తు పట్టలేక పోయాను అని అన్నారు. చాలా అందంగా ఉన్నారు షూటింగ్ లేనప్పుడు పంచ కట్టు కుంటారా అని అన్నారు. అలా ఎన్టీఆర్ ఆయనతో పని ముగించుకుని వెళ్ళిపోయారు.

Advertisement

also read:“పొన్నియన్ సెల్వన్” సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు…! అందులో ఒకరు టాలీవుడ్ స్టార్ కూడా ఉన్నారని తెలుసా…!

అలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఎన్టీఆర్ వాహిని స్టూడియో లో మేకప్ రూమ్ లో ఉన్నారు. అప్పటికి ఎన్టీఆర్ హీరోగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో ఏదో పని ఉంది అని చెప్పి నారాయణ రావు వచ్చారు. ఆయన కూడా మేకప్ రూమ్ లో నిలబడి లోపలికి కబురు పంపారు. కబురు అందుకున్న ఎన్టీఆర్, ఆయనను వెంటనే లోపలికి రమ్మనండి అని చెప్పారు. నారాయణ రావు ను చూడగానే ఎన్టీఆర్ లేచి నిలబడి గౌరవించారు. సీనియర్స్ అంటే ఎన్టీఆర్ కు అంత గౌరవం. ఎన్టీఆర్ పద్ధతిని చూసి నారాయణ రావు ఫిదా అయిపోయారు. తను వచ్చిన పని చెప్పి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు.

also read:సింగర్ మంగ్లీ గురించి ఈ నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఒక్క పాటకు ఎంతంటే..?

Visitors Are Also Reading