సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకు నచ్చని కథ మరో హీరోకు నచ్చడంలో తప్పు లేదు. ఎవరి అభిరుచులు వారికి ఉంటాయి. ఒక్కక్కొరు కథను ఒక్కోలా ఊహించుకుంటారు. అలా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో చేయడం అలా చేసి హిట్ కొట్టడం కూడా సహజం. ఇలా చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేతులు మారాయి. అచ్చం ఇదే మాదిరిగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ల కాలంలోనూ జరిగింది.
Advertisement
ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాలో నటించి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాముడు భీముడు సినిమా. ఈ సినిమాను రామానాయుడు నిర్మించారు. నిర్మాత రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి నిర్మించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాతో రామానాయుడు మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది.
Advertisement
అయితే ఈ సినిమాను మొదట దర్శకనిర్మాతలు మొదట ఏఎన్ఆర్ తో చేయాలని అనుకున్నారు. ఆయనకు వినిపించారు కూడా..ఇక కథ నచ్చినప్పటికీ ఏఎన్ఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దాని వెనక ఓ కారణం కూడా ఉంది. ఏఎన్ఆర్ కథ నచ్చినప్పటికీ తాను బిజీ ఉన్నానని..వ్యక్తిగత కారణాల వల్ల జగన్నాత్ రావు గారికి కాల్ షీట్లు ఇవ్వలేనని చెప్పారట.
దాంతో ఇదే కథను తాపీ చాణక్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు కలెక్షన్ లు కూడా భారీగా వచ్చాయి. అలా ఏఎన్ఆర్ రిజెక్ట్ చేయడంతో ఆ అదృష్టం ఎన్టీఆర్ ను వరించింది.