Home » కళ్యాణ్ రామ్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే..?

కళ్యాణ్ రామ్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్.. అసలు ఏం జరిగిందంటే..?

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ వరుస హిట్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఓ వైపు హీరోగా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇలా ఎవ్వరికీ వారు ఇద్దరూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Advertisement

గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కొన్ని వార్తలు పాజిటివ్ గా వినిపించగా.. మరికొన్ని వార్తలు నెగిటివ్ గా వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా అన్నదమ్ములు అంటే ఇలాగే ఉండాలని అనుకునేలా కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ల మధ్య అనుబంధం కనిపిస్తుంది. వీరిద్దరూ కలిసి కట్టుగా నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగా కనిపిస్తున్నారు. నందమూరి కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ తమ్ముడి కోసం కళ్యాణ్ రామ్ నిలబడుతున్నారు. అటు ఎన్టీఆర్ కూడా అన్న కోసం చేయాల్సింది చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎన్టీఆర్ తన వంతు సహాయం చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్స్ కి వచ్చిన అన్న సినిమాలకు క్రేజ్ తెస్తున్నాడు.

బింబిసార, అమిగోస్ ఇలా ప్రతీ సినిమాకి ఎన్టీఆర్ అన్న కోసం ప్రమోషన్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాలు పంచుకోలేకపోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ ముందుకు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ డెవిల్ ఈవెంట్స్ కి రావడం లేదని తెలుస్తోంది. కారణం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. సాధారణంగా సెలబ్రిటీస్ చాలా మంది న్యూ ఇయర్ వేడుకల కోసం ఏదో ఒక దేశాన్ని ఎంచుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉంటారు. 2023లో  ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో అమెరికాలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునున్నారు.  అలాగే 2024లో కూడా న్యూ ఇయర్ ని అలాగే ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.  డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రాలేకపోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading