Home » అన్న‌గారు క్రియేట్ చేసీన‌ ఆ రికార్డును ఇప్ప‌టికీ ట‌చ్ చేయ‌లేక‌పోయారు..!

అన్న‌గారు క్రియేట్ చేసీన‌ ఆ రికార్డును ఇప్ప‌టికీ ట‌చ్ చేయ‌లేక‌పోయారు..!

by AJAY
Ad

పౌరాణిక సినిమాలకు పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్రస్ ఎన్టీ రామారావు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటులలో ఎన్.టి.రామారావు కూడా ఒకరు. గుక్క తిప్పకుండా డైలాగులు చెబుతూ గంభీరమైన గొంతుతో ఎన్టీ రామారావు ప్రేక్షకులను మైమరిపించారు. ఎన్నో పౌరాణిక చిత్రాలలో వివిధ పాత్రల్లో నటించి ఔరా అనిపించారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. దాంతో రాముడు అంటే ఎన్టీఆర్ ముఖాన్ని తెలుగు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ సినిమాల‌లో దాన వీర శూర కర్ణ కూడా ఒక‌టి.

Advertisement

అయితే ఈ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటులందరూ బుక్కయ్యారు. అయితే అప్పటికే 1977 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా తన సినిమాను విడుదల చేస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు. దాంతో ఎలాగైనా దాన వీర శూరకర్ణ సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఎన్టీఆర్ న‌టీన‌టులు లేకుండానే తన సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.

Advertisement

సినిమాకు సంబంధించిన అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం అన్నీ ఎన్టీఆర్ కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు దుర్యోధనుడు, కర్ణుడు మ‌రియు కృష్ణుడు గా త్రిపాత్రాభినయం చేసి అలరించాడు. మరోవైపు నటీనటులు లేకపోవడంతో బాలయ్య తో పాటు హరికృష్ణను రెండు పాత్రల కోసం తీసుకున్నాడు.

షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి అనుకున్న సమయానికి కంప్లీట్ చేశాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయగా భారీ విజయం సాధించింది. తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది. మరోవైపు రెండో విడుదల కూడా వంద రోజులు ఆడి సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ రికార్డును ఇప్పటికీ ఏ సినిమా కూడా క్రియేట్ చేయ‌లేక పోవ‌డం చెప్పుకోదగ్గ విషయం.

also read : అన్న‌గారికి చుట్ట‌తాగ‌టం అల‌వాటు చేసింది ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading