Home » భార్యకు ఇచ్చిన మాట కోసం.. 14 ఏళ్ళు NTR తో కలిసి ANR నటించలేదు..!

భార్యకు ఇచ్చిన మాట కోసం.. 14 ఏళ్ళు NTR తో కలిసి ANR నటించలేదు..!

by Sravya
Ad

ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు వంటి వాళ్ళు. సినిమా రంగానికి ఇద్దరు తారలు ఎనలేని సేవ చేశారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన మూవీస్ చేయడానికి దోహదపడ్డారు. అప్పట్లో ఇద్దరు టాప్ హీరోలు అయినప్పటికీ ఏ మాత్రం ఇగోలకి, గొడవలకి పోకుండా అన్నదమ్ముల్లా ఉండేవారు. ఇద్దరూ మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ కలిసి నటించడానికి ఏమాత్రం ఆలోచించేవారు కాదు.

Advertisement

Also read:

వాళ్ళిద్దరూ కలిసి 14 సినిమాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు కానీ ఒకసారి వాళ్ళ బంధానికి బ్రేక్ పడింది. అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ. ఎన్టీఆర్ తో కలిసి నటించొద్దని అక్కినేని దగ్గర ఆ మాట తీసుకుంది. ఆమెకి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల పాటు ఆయనతో కలిసి నటించలేదు. 1963 లో వచ్చిన శ్రీకృష్ణార్జునయుద్ధం మూవీతో వీళ్ళ కాంబినేషన్ కి బ్రేక్ పడింది.

Advertisement

కృష్ణుడు పాత్ర లో ఎన్టీఆర్, అర్జునుడు పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. 1963 లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్ అయింది. కృష్ణుడు పాత్రకి ప్రాధాన్యత ఉండడం వలన ఎన్టీఆర్ పాత్ర అద్భుతంగా పండింది. అక్కినేని పాత్ర తేలిపోయింది. అక్కినేని అభిమానులు ఎంతో బాధపడ్డారు ఈ విషయం అన్నపూర్ణకు అభిమానులు చేరవేశారు. ఆమె వెంటనే ఎన్టీఆర్ తో సినిమాలు చేయకూడదని మాట ఇవ్వమని అడిగారు. 14 ఏళ్ల పాటు ఇలా వీళ్ళ కాంబినేషన్లో సినిమాలు రాలేదు. 1977లో చాణక్యచంద్రగుప్త మూవీలో కలిసి నటించారు ఎన్టీఆర్ స్వయంగా నటించమని కోరారు ఇలా మళ్లీ వీరిద్దరూ సినిమా చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading