NTR స్వీయ దర్వకత్వంలో NTR యే హీరోగా తెరకెక్కిన చిత్రం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర.! ఇందిరా గాంధీ కావాలనే ఈ సినిమా విడుదలను అడ్డుకున్నారని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. చాలా మంది సినిమా విశ్లేషకులు అప్పట్లో దీనిని ధృవీకరించారని కూడా చెబుతారు!
Advertisement
ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది :
NTR ఒకసారి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న బ్రహ్మం గారి చెక్క చెప్పులను ధరించారట., అవి సరిగ్గా ఆయన కాళ్లకు సెట్ అవ్వడంతో ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యారట NTR! అప్పుడే తెరమీది బొమ్మలు ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాయని బ్రహ్మంగారు చెప్పిన విషయం NTR ను అమితంగా ఆకర్షించిందట! దాంతో బ్రహ్మంగారి చరిత్రపై సినిమా తీయాలనుకున్న NTR ఒక సంవత్సరం పాటు పరిశోధించి తనే డైరెక్టర్ గా శ్రీ బ్రహ్మేంద్రస్వామి అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కించాడు.
Advertisement
1980 లో షూటింగ్ ప్రారంభమై, చకా చకా పనులు పూర్తి చేసుకొని 1981 వరకు ఈ సినిమా రిలీజ్ కు వచ్చేసింది కానీ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. దీంతో NTR కోర్ట్ కు వెళ్లి 3 సంవత్సరాల లీగల్ ఫైట్ తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఇందిరాగాంధీ హస్తం ఉందని టాక్…. ఎవరో ఈ సినిమా రిలీజైతే NTR సిఎం అవుతారని ఇందిరకు చెప్పారట…అందుకే ఈ సినిమాను అడ్డుకుందనే టాక్ అప్పట్లో గట్టిగానే వినిపించింది.
సినిమా రిలీజైంది NTR సిఎం అయ్యారు!
బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఆ సినిమా రిలీజైన తర్వాత NTR సిఎం అయ్యారు. అంతే కాదు పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది.