Home » ఎన్టీఆర్ కు ఎన్నిభాష‌లు వ‌చ్చో తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే..!

ఎన్టీఆర్ కు ఎన్నిభాష‌లు వ‌చ్చో తెలిస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే..!

by AJAY
Ad

నంద‌మూరి వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఎన్టీఆర్. వ‌రుస సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. త‌న న‌ట‌నతో ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియాకు ప‌రిచ‌యం అవ్వ‌బోతున్నాడు. ఇక ఎన్టీఆర్ న‌ట‌న‌, డ్యాన్స్ మ‌రియు ఫైట్లు ఇర‌గ‌దీస్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ఎన్టీఆర్ గుక్క తిప్ప‌కుండా డైలాగులు చెప్ప‌డంలో కూడా సిద్ద‌హ‌స్తుడు. తార‌క్ లో ఇవే కాకుండా ఎవ‌రికీ తెలియని మ‌రో టాలెంట్ కూడా ఉంది. అదేంటంటే భాష‌లు మాట్లాడ‌టం.

Advertisement

NTR

NTR

తెలుగు హీరోలు తెలుగుతో పాటూ ఇంగ్లీష్ మాట్లాడ‌టం సాధార‌ణ‌మే…ఏదైనా ఫంక్ష‌న్ వచ్చిందంటే ఇంగ్లీష్ లో ఇర‌గ‌దీస్తారు. అయితే ఎన్టీఆర్ కు తెలుగు ఇంగ్లీష్ తో పాటూ మ‌రికొన్ని భాష‌లు కూడా మాట్లాడ‌గ‌లుగుతాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ క‌ర్నాట‌క లోని బెంగుళూరులో ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఈవెంట్ లో ఎన్టీఆర్ క‌న్న‌డ మాట్లాడుతూ అక్క‌డ వారిని ఆక‌ట్టుకున్నారు. ఎన్టీఆర్ ఎంతో కాన్ఫిడెంట్ గా క‌న్న‌డ మాట్లాడ‌టం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అంతే కాకుండా ముంబైలో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ ఎన్టీఆర్ హిందీలో మాట్లాడి అంద‌ర్నీ అబ్బుర ప‌రిచారు.

Advertisement

మ‌రోవైపు చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ త‌మిళ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లు చూసిన ఎన్టీఆర్ అభిమానులు వివిధ భాష‌ల్లో మాట్లాడ‌టం చూసి అవాక్క‌య్యారు. ఎన్టీఆర్ కు ఇన్ని భాష‌లు వ‌చ్చా అని సంబుర‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైల‌ర్ తో ప్రేక్ష‌కుల్లో సినిమాపై మ‌రింత అంచ‌నాలు నెల‌కొన్నాయి. దాంతో సినిమా విడుద‌ల కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. మ‌రి సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Visitors Are Also Reading