పాత కథ అయినప్పటికీ సరికొత్త నేపథ్యాన్ని ఎన్నుకొని ఆసక్తికరంగా తీస్తే విజయం సాధించవచ్చు. అనే సూత్రాన్ని తెలుగు సినిమాకు నేర్పించిన చిత్రం అడవి రాముడు. సౌత్ ఇండియాలోనే తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటరత్న ఎన్టీఆర్ ఇమేజ్ ను తగిన విధంగా ఉపయోగించుకొని తీసిన సినిమా అడవి రాముడు. అంతేకాదు హీరోగా ఆయనను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో నటించిన జయప్రద, జయసుధ ఇద్దరు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఈ సినిమా విడుదలైన మొదటి వారం 23 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. 40 కేంద్రాల్లో 50 రోజులు, 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే 16 కేంద్రాల్లో 25 వారాలు, నాలుగు సెంటర్లలో సంవత్సరం పాటు ఆడింది. అంతకు ముందు వచ్చిన లవకుశ, దానవీరశూరకర్ణ సినిమాలు కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తే, అడవి రాముడు సినిమా నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆ రికార్డులను బ్రేక్ చేసింది. బాలీవుడ్లో షోలే చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయిందో టాలీవుడ్ లో అడవి రాముడు సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. అడవి రాముడు సినిమా శతదినోత్సవం 1977, ఆగస్టు 7న విజయవాడలో జరిగింది.
Advertisement
Advertisement
అడవిరాముడు ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ఏఎన్ఆర్, అలాగే బాలీవుడ్ టాప్ స్టార్ దిలీప్ కుమార్ కూడా రావడం విశేషం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దిలీప్ కుమార్ ఈ ముగ్గురు అగ్ర కథానాయకులు కలిసి తొలిసారిగా విజయవాడకు రావడంతో వీరిని చూడడానికి జనం వెల్లువెత్తారు. అప్పట్లో అడవి రాముడు చిత్రం విజయం అనూహ్యం అపూర్వం. ప్రపంచంలో మరే నటుడూ చేయలేని అద్భుత నటన ఎన్టీఆర్ సొంతం. అడవిరాముడు 200వ రోజు వేడుక చెన్నై లోని తాజ్ కోరమండల్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకకు నటుడు నిర్మాత అయినటువంటి రాజ్ కపూర్ ముఖ్య అతిథిగా వచ్చారు.
ALSO READ;
కేజీఎఫ్-2 ప్రముఖ నటుడు మృతి.. ఎలా అంటే..!!
అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!