నటి సూర్యకాంతం ప్రస్తుతమున్న ప్రేక్షకులకు ఈ పేరంటే అంతగా పరిచయం లేదు కానీ, ఎన్టీఆర్, ఏఎన్నార్ టైం లో సూర్యకాంతం అంటే ఒక స్టార్ హీరో రేంజ్ లో పేరు తెచ్చుకున్న నటి.. కుటుంబ నేపథ్య కథలతో ఏ సినిమా వచ్చిన తప్పనిసరిగా సూర్యకాంతం పాత్ర ఉండాల్సిందే. ఆ కాలంలో గయ్యాళి అత్త పాత్రలో నటించేది.. ఈ పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సూర్యకాంతం సినిమాల్లో మాత్రమే గయ్యాలి పాత్ర చేసేది కానీ నిజజీవితంలో ఎంతో మనసు కలిగిన మనిషి..
Advertisement
also read:చిరుతో అది చేసిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!!
ఎవరినైనా ప్రేమగా ఆప్యాయంగా పిలిచేదట.. కానీ బయట ప్రేక్షకులకు మాత్రం ఆమె గయ్యాళి పాత్రలోనే డిసైడ్ అయిపోయింది.. అలాంటి సూర్యకాంతం తన నిజ జీవితంలో ఎన్నో కుటుంబ వ్యవహారాలను పాటిస్తూ ఉండేవారట. సూర్యకాంతం భర్త ఇంటి భోజనం తప్ప బయట అసలు తినేవారు కాదట. దీంతో సూర్యకాంతం ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని షూటింగ్స్ కి వెళ్ళలేదట. ఈ క్రమంలోనే దాదాపు పది సంవత్సరాలపాటు ఆమెకు తీరికలేని షూటింగ్స్ వల్ల కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయట.. ఈ సందర్భంలోనే ఇంట్లో వంట చేయడానికి వీలుపడకపోవడంతో తన భర్తను ఒప్పించి, ఎన్టీఆర్ మరియు రేలంగి వెంకట్రామయ్య సూచన మేరకు విజయవాడకు చెందినటువంటి ఒక బ్రాహ్మణ అమ్మాయిని పనిమనిషిగా పెట్టాలని అనుకున్నారట.
Advertisement
అయితే ఆ అమ్మాయి ఎవరి ఇంట్లో పని చేయాలని అడగకుండానే విజయవాడలో ట్రైన్ ఎక్కి మద్రాసులో దిగారు. ఈమేను రిసీవ్ చేసుకోవడానికి కారు పంపించారు. ఆ పనిమనిషి కారు ఎక్కే టైంలో నేనెవరింట్లో పని చేయాలని అడిగిందట. దీంతో వారు సూర్యకాంతం పేరు చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెనుతిరిగి విజయవాడ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సూర్యకాంతం అత్తకు ఎంత పేరు ఉంది అంటూ ఆట పట్టించేవారట. ఏది ఏమైనా ఆమె షూటింగ్స్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో స్వయంగా ఎన్టీఆర్ సూర్యకాంతం ఇంట్లో వంట చేయడం కోసం ఒక పనిమనిషిని నియమించినట్టు గుమ్మడి తన పుస్తకంలో రాసుకొచ్చారు.
also read: