టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ ఇంట వివాహ సంబరాలు మొదలయ్యాయి. ఆయన పెద్ద కూతురు అయిన ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి మొదలు సోషల్ మీడియా వేదికగా ప్రతి కార్యక్రమాన్ని షేర్ చేస్తున్నారు ఆలీ దంపతులు. ఎంతో అట్టహాసంగా సాగుతున్న ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఇతర స్టార్ సెలబ్రిటీ లందరూ కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Advertisement
also read:చంద్రమోహన్ కూతుళ్లు ఎంత అందంగా ఉన్నారో చూశారా…? ఛాన్స్ వచ్చినా ఎందుకు సినిమాల్లో నటించలేదంటే..?
ఇప్పటికే హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. ఈ ఆదివారం రోజున జరిగినటువంటి ఈ వివాహ వేడుకకు తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ హీరోలే కాకుండా, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒకేసారి వివాహ వేడుకకి ఇంతమంది ప్రముఖులు రావడంతో అంతా సందడిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి వివాహ వేడుకకు వచ్చి కమెడియన్ ఆలీతో కాసేపు సరదాగా గడిపారు.. ఒకరికొకరు మాట్లాడుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
B O S S #MegastarChiranjeevi garu today @#Ali Daughters Marriage 🤩#ValtheruVerayya #BossParty@KChiruTweets @Chiru2020_ @Deepu0124 @Chirufan4ever @ChiruIdealActor @Chiru_FC @ChiruFanClub @Chiru025527081 @EluruMegaFan @GaddamMega @Konidelachiru31 pic.twitter.com/KADKQeGnEQ
— Ramesh BOLLI (@RameshBOLLIS) November 27, 2022
ఆ తర్వాత పాతీమా దంపతులను ఆశీర్వదించారు చిరంజీవి. అంతేకాకుండా నాగార్జున దంపతులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ వేడుకలో కాసేపు సందడి సందడిగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి..
Advertisement
also read: