నటసార్వభౌముడు తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుడు ఎన్టీరామారావు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం ఒకేరకమైన పాత్రలకు ఫిక్స్ అవ్వకుండా అన్ని రకాల పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో అదరగొట్టారు. రాముడు, కృష్ణుడి పాత్రలు చేయాలంటే ఎన్టీఆర్ తరవాతనే ఎవరైనా. ఇక ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారో చెప్పడానికి ఓ ఉదాహరణ కూడా ఉంది.
Advertisement
తిరుపతిలో స్వామి వారి దర్శనం చేసుకున్న తరవాత కొంతమంది చెన్నై లోని ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఆయనను దర్శించుకునేవారట. కేవలం సినిమాలలోనే కాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి అతి తక్కవ సమయంలోనే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుకున్నారు. రాజకీయాల్లోకి స్వలాభం కోసం రాకుండా కేవలం ప్రజాసేవ కోసమే వచ్చి తెలుగు ప్రజలకు సేవ చేశారు.
Advertisement
పేదలకు మేలు చేసే పథకాలను తీసకువచ్చి తన దైన స్టైల్ లో రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్నాడంటే అప్పట్లో ప్రజలు ఎగబడి వచ్చేవారు. ఆయన సభలు ఎంతో సందడి గా కనిపించేవి. ఇక ఎన్టీఆర్ ఓ సమయంలో పదవి కోల్పోవడంతో పాటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఒంటిరిగా ఉన్న ఎన్టీఆర్ గుండె పోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్టీఆర్ కు అంతకంటే ముందే ఒకసారి గుండె పోటు వచ్చిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ కే. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో జస్టిస్ చౌదరి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ కు మొదటి సారి గుండె పోటు వచ్చింది. సినిమాలో ఓ పాట చిత్రికరణ సమయంలో ఎన్టీఆర్ కు మొదటిసారి గుండె పోటు రాగా కాసేపు రెస్ట్ తీసుకుని ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే కొన్నేళ్ల తరవాత ఎన్టీఆర్ ఈ విషయాన్ని తనకు చెప్పారని రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.