సినిమా ఇండస్ట్రీ అంటేనే బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వాలినట్టు ఎవరైతే సక్సెస్ తో దూసుకుపోతారో వారికే ఎక్కువ ఆఫర్లు వస్తూ ఉంటాయి. మరి ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఏ విధంగా దూసుకుపోతారనేది చెప్పడం కష్టం. ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ మంచి హిట్ కొడితే స్టార్ హీరోలు సైతం పిలిచి మరీ అవకాశం కల్పిస్తారు.
Advertisement
అదే డైరెక్టర్ ఫ్లాప్ అయితే మాత్రం మళ్లీ అతని నుండి హిట్ వచ్చే దాకా స్టార్ హీరోలు అతని వైపు కూడా చూడరు. ఇది ఇండస్ట్రీలో చాలా కామన్ గా ఉండే పరిస్థితి. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఇదంతా రివర్స్ గా ఉంది. భారీగా ఫ్లాపులు వచ్చిన డైరెక్టర్ తో ఎన్టీఆర్ వరుస సినిమాలు కూడా చేశారు.
మొదట్లో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో రాజమౌళి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ ను పరిచయం చేసిన ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా డైరెక్టర్లకు ఉండే టాలెంట్ ను నమ్మరు కానీ అతని సక్సెస్ రేట్ ను కాదు. ఆయన ఇప్పటికి ఐదు సార్లు ఫ్లాప్ అయిన డైరెక్టర్ లతో సినిమాలు చేశారు.
ఇందులో అసలు విషయం ఏంటంటే వాళ్లంతా ఎన్టీఆర్ నమ్మకం నిలబెట్టే హిట్స్ ఇవ్వడం. మున్నా సినిమా తో ప్రభాస్ కి ఫ్లాప్ ఇచ్చిన వంశీ పైడిపల్లి, ఆ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఎంత మంది హీరోల చుట్టూ తిరిగినా అవకాశం ఇవ్వలేదు. కానీ ఆ టైంలో ఎన్టీఆర్ వంశీ ని నమ్మి అవకాశం ఇచ్చాడు.
Advertisement
ఆ సినిమానే బృందావనం. ఎన్టీఆర్ ను కొత్త యాంగిల్ లో చూపించి సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత నాన్నకు ప్రేమతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందిన సుకుమార్ మహేష్ బాబుతో వన్, నేనొక్కడినే భారీ డిజాస్టర్ సినిమాలు తీశారు.
అప్పుడు కూడా ఆయనను నమ్మి అవకాశం ఇచ్చింది మళ్లీ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో మూవీ తో సూపర్ హిట్ కొట్టి సుకుమారుడు మళ్లీ పూర్వవైభవం వచ్చేలా చేశారు. తర్వాత జై లవకుశ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన తర్వాత ఇక ఏ హీరో డైరెక్టర్ బాబుని దగ్గరకు రానివ్వలేదు.
కానీ ఎన్టీఆర్ ఛాయిస్ ఇచ్చి జై లవకుశ సినిమాని చేశారు. దీంతో ఈ సినిమా కూడా భారీ హిట్ అయ్యింది. ఇక అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత ఇక త్రివిక్రమ్ పని అయిపోయింది అని భావించారు.
కానీ ఎన్టీఆర్ ఆయనతో అరవింద సమేత చేసి ఈ సినిమా కూడా హిట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ అయింది. కానీ ఎన్టీఆర్ ఆయనతో మళ్లీ ఎన్టీఆర్ 30 మూవీ ఛాయిస్ ఇస్తున్నారు.