సూపర్ స్టార్ కృష్ణ అన్నగారు ఎన్టీరామారావు ల మధ్య సినిమాల పరంగా కొన్ని ఇష్యూలు జరిగిన సంగతి తెలిసిందే. అల్లూరిసీతారామరాజు సినిమా విషయంలో ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడిచింది. అంతే కాకుండా పొలిటికల్ గా కూడా కృష్ణ ఎన్టీఆర్ ను విభేదించారు. ఎన్టీఆర్ పాలనపై కృష్ణ విమర్శలు కురిపించారు. అంతే కాకుండా కృష్ణ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎన్నికలలో కూడా ప్రచారం చేశారు. మొదట 1985 ఎన్నికల్లో భాగంగా కృష్ణ కాంగ్రెస్ తరుపున తిరుపతి సభలో ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారు.
Advertisement
ఈ సభ సక్సెస్ అవ్వడంతో నంద్యాలలో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేశారు. 1984 డిసెంబర్ 20 వ తేదీన కృష్ణ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు ఉదయం రావాల్సి ఉండగా కృష్ణ విజయనిర్మలతో కలిసి సాయంత్రం సభకు హజరయ్యారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరయ్యారు. విజయ నిర్మలను చూసేందుకు ఈ సభకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇక కృష్ణ తన వాహనం పై నిలుచుని చేయి ఊపుతున్నారు. ఆయన తో వచ్చిన విజయ నిర్మల కూడా ప్రజలకు చేయి ఊపుతున్నారు.
Advertisement
కృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని ఆయనకు విజయ నిర్మలకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి బై కొడుతూ నినాదాలు చేశారు. ఇక అదే సభకు ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది వచ్చారు. సభ జరుగుతుండగా సైకిల్ ను పైకి ఎత్తి కృష్ణ డౌన్ డౌన్ ఎన్టీఆర్ జిందాబాద్..టీడీపీ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నంద్యాల అభ్యర్థి వెంకట సుబ్బయ్యకు మీ ఓటు వేయాలంటూ అభ్యర్తిని కృష్ణ ప్రజలకు పరిచయం చేశారు. కృష్ణ మాట్లాడుతూ….ఎన్టీఆర్ ప్రభుత్వం రెండేళ్లలోనే కూలిపోయిందన్నారు.
ఆయన తన ఎమ్మెల్యేలతో వెట్టి చాకిరీ చేయించుకోవడం వల్లనే వాళ్లు ఆయనకు వ్యతిరేఖం అయ్యారని చెప్పారు. ఆ తరవాత విజయ నిర్మల కూడా తన దైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చారు. కానీ సభ ముగిసే సమయంలో కొంతమంది కృష్ణ విజయనిర్మల పై రాళ్లు చెప్పులు విసిరారు. ఈ దాడిలో విజయ నిర్మలకు గాయాలయ్యాయి. కృష్ణ కంటికి సైతం గాయం అవ్వడం వల్ల ఆ తరవాత ఆయన సభలు వాయిదా పడ్డాయి.
AlSo READ :