నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీ రామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి మరణించారు. గత కొద్ది రోజులుగా ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు మానసిక ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి బంజారాహిల్స్ లోని తమ నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఉమామహేశ్వరి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ లోని వారి నివాసానికి తరలించారు. ఇప్పటికే నందమూరి హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఉమామహేశ్వరి మరణించడంతో గతంలో నందమూరి ఫ్యామిలీలో మరణించిన వారిని సైతం అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
Advertisement
Advertisement
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ కేవలం 17 ఏళ్ల వయసులోనే మసూచి వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. రామకృష్ణ పెద్దలను ఎంతో గౌరవించేవారు. ఆయన అంటే ఎన్టీఆర్ సైతం చాలా ఇష్టపడేవారు. కానీ చిన్న వయసులోనే రామకృష్ణ మరణించడంతో ఎన్టీఆర్ తన చిన్న కుమారుడికి జూనియర్ రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారు.
నందమూరి హరికృష్ణ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో రాజకీయాల్లో హరికృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు. 2018లో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతివేగం వల్ల హరికృష్ణ మృతి చెందారని అప్పుడు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇలా ఉంటే మొత్తం ఎన్టీ రామారావు కు 12 మంది సంతానం కాగా వారిలో ఎనిమిది మంది కొడుకులు నలుగురు కూతుళ్లు జన్మించారు. ఇప్పుడు వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె స్వర్గస్తులయ్యారు.