నందమూరి తారకరామారావు నటించిన సినిమాల్లో తీసుకున్నా డైలాగుల పరంగా చాలా అర్థం ఉంటుంది. ప్రతి పదం కూడా చాలా నీట్‌గా ఉచ్చారణకు తగిన విధంగా అర్థం వచ్చే విధంగా ఉంటుంది. అంతేకాదు. డైలాగ్లను మింగేయడం వేరే భాషా పదాను తీసుకువచ్చి కలపడం ఏదో ప్రత్యేకత పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం.. వంటివి అన్నగారికి నచ్చేవి కాదు. అందుకే అన్నగారి సినిమాలకు డైలాగులు రాసేవారిని నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఎంచుకునేవారు.
Advertisement
ఎన్టీఆర్ కూడా స్వయంగా కొన్ని సినిమాఉ తీశారు. ఆయా సినిమాల్లో అన్నగారు తన సీన్‌కు సంబంధించిన డైలాగ్‌లను రైటర్‌ను కూర్చొబెట్టుకుని మరీ రాయించుకునేవారట. ఒకవేళ ఏదైనా కుదరకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసి మళ్లీ మళ్లీ రాయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికి కూడా రైటర్ రాయలేకపోతే తనే స్యయంగా రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని అన్నగారే స్వయంగా చెప్పుకున్నారు. ఇలా జస్టీస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో తన డైలాగులు తనే రాసుకున్నారు.
Advertisement
సినిమాలతో సంబంధం లేని వారని కూడా తీసుకొచ్చి డైలాగ్‌లు రాయించిన సందర్భాలు కూడా అన్నగారి సినిమాలో కనిపిస్తాయి అన్నగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా.. దానవీరశూరకర్ణ దీనికి ముగ్గురు రైటర్లు డైలాగ్‌లు రాశారు. వాస్తవానికి ఒక సినిమాకు ఒక్కరే డైలాగ్‌లు రాస్తారు. కానీ ఈసినిమాలో దుర్యోదన పాత్రకు మాత్రం అన్నగారు పని గట్టుకుని తిరుపతి వెంకట కవులను ఒప్పించి మరీ దుర్యోదన పాత్రకు డైలాగ్‌లు రాయించుకున్నారు.
నిజానికి వారికి సినిమాలతో సంబంధంలేదు. అయినా కూడా అన్నగారు వారికి ఉన్న పౌరాణిక విద్యను జ్ఞానాన్ని ఈ సినిమాకు వినియోగించుకున్నారు. అందుకే సినిమాలో డైలాగ్‌లు ఇప్పటికీ రికార్డే.. ఆచార్యదేవా ఏమింటివి ఏమంటివి..? పాంచాలి పంచభర్తృక ఇలా పలు డైలాగ్‌లు సామాన్యుల నాలుకపై ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
Also Read : అల్లు అర్జున్ బంగారు బాతు..కానీ ఆ ఇద్దరు స్టార్లు..వేణుస్వామి సంచలన జోతిష్యం..!