Telugu News » Blog » అల్లు అర్జున్ బంగారు బాతు..కానీ ఆ ఇద్ద‌రు స్టార్లు..వేణుస్వామి సంచ‌ల‌న జోతిష్యం..!

అల్లు అర్జున్ బంగారు బాతు..కానీ ఆ ఇద్ద‌రు స్టార్లు..వేణుస్వామి సంచ‌ల‌న జోతిష్యం..!

by AJAY
Ads

ప్ర‌ముఖ‌ జోతిష్యుడు వేణుస్వామి జోతిష్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయ నాయకులు సినీ సెల‌బ్రెటీల జాత‌కాలు చెబుతూ వేణూ స్వామి ఫేమ‌స్ అయ్యారు. ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వేణు స్వామి టాలీవుడ్ లోని పలువ‌రు హీరోల జాతకాల‌ను బ‌య‌టపెట్టాడు. అంతే కాకుండా హీరో ప్ర‌భాస్ జాత‌కం పై సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశాడు. ప్ర‌భాస్ తో సినిమాలు చేస్తే న‌ష్ట‌పోవాల్సిందే అంటూ కామెంట్ లు చేశాడు.

Rashmika venu swami

ఇంకా వేణు స్వామి మాట్లాడుతూ….హీరోల గురించి మాట్లాడుతా అంటారు కానీ ఎవ‌రైతే ప‌బ్లిక్ డొమైన్ లో ఉంటారో వాళ్ల గురించి మాట్లాడే హ‌క్కు సాధార‌ణంగానే ఉంటుంది. నా గురించి కూడా అంద‌రూ మాట్లాడుతుంటారు. వాళ్ల‌ను కాద‌న‌డానికి లేదు. ఈ కొత్త సంవ‌త్స‌రంలో ఇద్ద‌రు స్టార్ హీరోల గురించి సంచ‌ల‌న వార్త‌లు వింటారు. వాళ్ల పేర్ల‌ను చెప్ప‌ను కానీ వాళ్లకు అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. వాళ్లు ఒప్పుకున్న ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అవుతాయి.

కానీ అల్లు అర్జున్ జాతకం మాత్రం భాగుంది. రాబోయే ఐదేళ్ల‌లో ఆయ‌న జాత‌కంలో ఎలాంటి మార్పులు రావు. ఆయ‌న చేసిన ప్రాజెక్టులు పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లై త‌క్కువ‌లో త‌క్కువ 200 కోట్ల క‌లెక్ష‌న్ ల‌ను రాబ‌డ‌తాయి రాసిపెట్టుకోండి…ఆయ‌నే ఇప్పుడు బంగారు బాతు….ఇక ఇద్ద‌రు హీరోల‌లో ఒక హీరోకు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చి సినిమా ఆగిపోవ‌చ్చు. అంటూ కామెంట్ చేశాడు.

ALSO READ : ANASUYA : తెలుగు ఆడ‌ప‌డుచుల ప‌రువుతీస్తున్నావంటూ కామెంట్స్…నెటిజ‌న్ పై అన‌స‌య ఫైర్..!

అయితే ఆ ఇద్ద‌రు హీరోల పేర్లు మాత్రం వేణు స్వామి బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఇదిలా ఉంటే స‌మంత నాగ‌చైత‌న్య విడిపోతార‌ని గ‌తంలో వేణు స్వామి జోతిష్యం చెప్పిన సంగ‌తి తెలిసిందే. కాగా వేణు స్వామి చెప్పిన‌ట్టే జ‌ర‌గ‌టంతో ఆయ‌న జోతిష్యానికి మ‌రింత డిమాండ్ పెర‌గింది. అయితే ప్ర‌భాస్ పై వేణు స్వామి చెప్పిన జోతిష్యంకు ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.


You may also like