చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాని దానయ్య నిర్మించగా కీరవాణి స్వరాలు సమకూర్చారు. సినిమాలో చరణ్ అల్లూరి పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు. అంతే కాకుండా సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్ లుగా నటించారు.
Advertisement
ఇదిలా ఉండగా ఈ సినిమాలని పోస్టర్ లల్లో ఎన్టీఆర్ బైక్ పైన వెళుతుండగా రామ్ చరణ్ గుర్రం పై వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే పోస్టర్ లో కనిపించిన ఎన్టీఆర్ బైక్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాంతో అందరూ ఆ బైక్ గురించి చర్చించుకుంటున్నారు.
Advertisement
ఇక ఈ బైక్ ఆంగ్లేయుల కాలం నాటి బైక్ కావడం విశేషం. దాంతో ఈ బైక్ ఎక్కడ నుండి తీసుకువచ్చారు అన్న చర్చ మొదలైంది. ఇక ఆంగ్లేయుల కాలం బైక్ కోసం జక్కన్న చాలా ట్రై చేశారట. కానీ అప్పటి బైక్ ఎంత వెతికినా దొరకలేదు. దాంతో ఆంగ్లేయుల కాలంలో బైక్ లు ఎలా ఉండేవో తెలుసుకుని రాజమౌళి అలాంటి బైక్ నే తయారు చేయించారు. అంతే కాకుండా ఈ బైక్ డిజైన్ కోసం ఏకంగా మేకర్స్ 20 లక్షల రూపాయలను ఖర్చు చేశారు.