సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉండటం అనేది సర్వసాధారణం. ఇద్దరు హీరోలు టాప్ ప్లేస్ లో ఉన్నారంటే వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండవచ్చు. లేదంటే మరోరకంగా అయినా పోటీ ఉండవచ్చు. కానీ ఎక్కువగా స్టార్ హీరోల మధ్యలో ఆరోగ్యకరమైన పోటీ కనిపించదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావుల మధ్య మాత్రం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే కనిపించేది.
Advertisement
వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా అన్నదమ్మాల్లా కనిపించేవారు. అంతే కాకుండా కలిసి సినిమాలు సైతం చేశేవారు. ఇక ఇండస్ట్రీలో పౌరానిక పాత్రల విషయానికి వస్తే ఎన్టీరామారావు రారాజు…అక్కడ ఆయనను ఢీ కొట్టే సత్తా మరొకరికి లేదు. అంతే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు సాంఘీకాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే శ్రీకృష్ణార్జున యుద్దం సినిమా తరవాత దాదాపు పద్నాలుగేళ్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య మాటల్లేవు. తిరిగి 1977లో విడుదలైన చాణక్య చంద్రగుప్త సినిమాతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఎన్టీఆర్ కు చాణక్యుడి పాత్రలో నటించాలనే కోరిక ఉండేది. ఆయన స్క్రిప్ట్ కూడా సిద్దం చేసుకున్నారు. కానీ ఏఎన్ఆర్ చాణక్యుడి పాత్రలో నటిస్తానని చెప్పడంతో ఎన్టీఆర్ ఆ పాత్రను ఇచ్చేసి తను చంద్రగుప్తుని పాత్రలో నటించాడు. అగ్రహీరో దర్శకత్వంలో అగ్రహీరోలు నటించడం అదే మొదటిసారి చివరిసారి కూడా.
ఈ సినిమాలో శివాజీ గణేష్ కూడా నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అప్పటికే దానవీరశూరకర్ణ సినిమా షూటింగ్ పూర్తికాగా ఎన్టీఆర్ ఆ సినిమాను పక్కన పెట్టి ముందు చాణక్యచంద్రగుప్త సినిమాను పూర్తిచేశారు. ఈ సినిమాలో తనకంటే ఏఎన్ఆర్ కు మంచి మార్కులు పడాలని ఎన్టీఆర్ భావించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరించింది. ఇక ఈ సినిమా విడుదలైన నెలరోజులకు అడవిరాముడు సినిమా వచ్చింది. ఆ వేవ్ లో చాణక్య చంద్రగుప్త సినిమా కొట్టుకుపోయింది.