సినిమా బ్రతికి ఉన్నంతవరకూ గుర్తుండిపోయే పేరు నందమూరి తారకరామారావు. సాంఘీక, పౌరాణిక,జనపద చిత్రాలలో నటించి గొప్ప నటుడిగా ఎన్టీఆర్ కీర్తించబడ్డారు. వరుస సినిమాలు చేస్తూ సినీపరిశ్రమలో విజయ దుందుబి మోగించారు. ఎన్టీఆర్ సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసేలా పేరుసంపాదించుకున్నారు. ఇక ఎన్టీఆర్ నటించిన పౌరాణిక పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు, రాముడు, అర్జునుడు, కర్నుడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించకుండా జీవించేశాడు. శ్రీకృష్ణుడు రాముడు అంటే ఎన్టీఆర్ స్వరూపమే గుర్తుకు వచ్చేలా ఆ పాత్రల్లో ఒదిగిపోయాడు.
ఇక సినిమాల్లో ఎంతో సక్సెస్ అయ్యిన ఎన్టీఆర్ ప్రజాసేవ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 1980లోనే సినిమాలకు గుడ్ బై చెప్పారు. 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇక పార్టీ పెట్టిన యేడాది లోపే ఎన్టీరామారావు సీఎం కుర్చీపై కూర్చున్నారు. కానీ 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తరావత వచ్చిన విరామంలో ఎన్టీఆర్ సినిమాలు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ మూడు చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం…
Advertisement
Advertisement
1991లో ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను సొంత బ్యానర్ లో నిర్మించారు. ఎన్టీరామారావు అధికారం కోల్పోయిన తరవాత వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
మళ్లీ 1992లో ఎన్టీఆర్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలోనే సామ్రాట్ అశోక సినిమా వచ్చింది. ఈ చిత్రంలో అన్నగారి పక్కన వాణి విశ్వనాథ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు ఫ్లాప్ అయ్యింది.
1993లో ఎన్టీరామారావు హీరోగా బాపు దర్శకత్వంలో శ్రీనాథకవిసార్వభౌముడు సినిమా విడుదలైంది. ఈ సినిమాలో జయసుధ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఆ తరవాత 1993లో లక్ష్మీప్రసన్న బ్యానర్ లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయడంకా మోగించి అధికారంలోకి వచ్చింది.