Home » మెస్ నుండి ప్రింటింగ్ ప్రెస్ వ‌ర‌కూ….సినిమాల్లోకి రాక‌ముందు ఎన్టీఆర్ చేసిన వ్యాపారాలు ఇవే..!

మెస్ నుండి ప్రింటింగ్ ప్రెస్ వ‌ర‌కూ….సినిమాల్లోకి రాక‌ముందు ఎన్టీఆర్ చేసిన వ్యాపారాలు ఇవే..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవాలి అంటే అంత సులువు కాదు. ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఎవ్వ‌రికీ స‌క్సెస్ ఊరికే రాదు. స‌క్సెస్ వెన‌కాల ఎంతో క‌ష్టం నిద్ర‌లేని రాత్రులు కూడా ఉంటాయి. స్టార్స్ గా ఎదిగిన హీరోలు అంతా అలాంటి క‌ష్టాలు అనుభవించిన‌వారే. అంతెందుకు ఆంధ్రుల ఆరాధ్య‌దైవం ఎన్టీఆర్ సైతం అలాంటి క‌ష్టాల‌ను అనుభవించే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి స‌క్సెస్ అయ్యారు.

Advertisement

సినిమాల్లోకి వ‌చ్చాక ఎన్టీఆర్ హీరో అయ్యారు కానీ అంత‌కుముందు ఆయ‌న జీవ‌నం కోసం ర‌క‌ర‌కాల ప‌నులు చేశారు. ఎన్టీఆర్ తండ్రి పేరు ల‌క్ష్మయ్య చౌద‌రి కాగా ఆయ‌న ఓ సొంత ఇంటిని కొనుగోలు చేశారు. ఇక అదే ఇంట్లో సూర్య‌నారాయ‌ణ చౌద‌రి అనే వ్య‌క్తి అద్దెకు ఉండేవారు.

Advertisement

సూర్య‌నారాయ‌ణ చౌద‌రి కొంతమంది వ్య‌క్తుల‌తో క‌లిసి వ్యాపారాన్ని మొద‌లు పెట్టారు. కాగా ఆయ‌న పార్ట్న‌ర్స్ దారుణంగా మోసం చేశారు. దాంతో సూర్య‌నారాయ‌ణ చౌద‌రి కోర్టును ఆశ్ర‌యించారు. ఆయ‌న‌కు తోడుగా ఎన్టీఆర్ కూడా వెళ్లారు. అలా సూర్య‌నారాయ‌ణ చౌద‌రితో క‌లిసి ఎన్టీఆర్ ముంబై కోర్టుకు వెళ్లారు. అలా వెళుతున్న క్ర‌మంలో ఎన్టీఆర్ కు ముంబై లో హోట‌ల్ పెట్టాల‌నే ఆలోచ‌న క‌లిగింది. అనుకున్న‌ట్టే మెస్ ను ప్రారంభించారు. కానీ అది త‌న తండ్రికి ఇష్టం లేక‌పోవ‌డంతో కొంత‌కాలానికే మూసివేశారు.

ఇక ఆ త‌ర‌వాత వెంక‌య్య అనే వ్య‌క్తితో క‌లిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. వెంక‌య్య మ‌ర‌ణించ‌డంతో ఆ వ్యాపారం కూడా మూత‌ప‌డింది. ఆ త‌ర‌వాత ప్రింటింగ్ ప్రెస్ ను సైతం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో న‌ష్టాలు రావ‌డంతో ప్రెస్ ను కూడా మూసివేశారు. ఇక ఆ త‌ర‌వాత బీఏ చ‌దువుతున్న రోజుల్లో ఎన్టీఆర్ కు ఎయిర్ ఆఫీస‌ర్ ఉద్యోగం వ‌చ్చింది. కానీ ఆయ‌న స‌తీమ‌ణికి ఆ ఉద్యోగం ఇష్టం లేక‌పోవ‌డంతో దానిని కూడా వ‌దిలేశారు. ఇక అన్నీ వ‌దిలి సినిమాల్లోకి వ‌చ్చిన ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఆ త‌ర‌వాత సీఎంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ చేసి వారి హృద‌యాల‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ : Vishnu priya : దేవుడా.. ముద్దుల కోసం బరితెగించిన విష్ణు ప్రియ !

Visitors Are Also Reading