సినిమా ఇండస్ట్రీకి వచ్చే చాలా మంది నటులలో హీరో అవ్వాలనే కోరికే ఉంటుంది. అయితే కొంతమందికి హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ పాత్రలు ఇతర పాత్రలు చేస్తూ సర్దుకు పోతారు. కానీ ఒక్కసారి హీరోగా చేస్తే ఆ తరవాత కూడా హీరోగానే నటించాలని అనుకుంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోలు విలన్ పాత్రలు చేయడం చూస్తున్నాం. కానీ స్టార్ హీరో స్టేటస్ లో ఉన్న ఏ ఒక్క హీరో కూడా నెగిటివ్ పాత్రల జోలికి వెళ్లడం లేదు.
ALSO READ : ఓటీటీ రిలీజ్ కు సిద్దమవుతున్న భీమ్లానాయక్..? ఎప్పుడంటే..!
Advertisement
ఒకవేళ స్టార్ హీరోలు నెగిటివ్ రోల్స్ వైపు వెళ్లినా అభిమానులు ఊరుకునేలా కనిపించడం లేదు. కానీ ఒకప్పటి స్టార్ హీరో….టాలీవుడ్ కు ఎంతో గుర్తింపు తెచ్చిన నటుడు ఎన్టీరామారావు స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో నెగిటివ్ పాత్రల్లో కూడా నటించి ఔరా అనిపించారు. అందువల్లే అన్నగారు తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. కేవలం హీరోగా కాకుండా అన్ని పాత్రలు చేస్తేనే నటుడిగా మంచి గుర్తింపు వస్తుందని ఎన్టీఆర్ బలంగా విశ్వసించేవారట.
Advertisement
అందువల్లనే నెగిటివ్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరించేవారట. కేవలం హీరో ఇమేజ్ కోసం పాకులాడుతూ ఉంటే నటుడిగా ఎదగలేమని ఎన్టీఆర్ భావించేవారట. ఎన్టీఆర్ తన మొదటి సినిమా మనదేశంలో పోలీస్ గా కనిపించారు. ఈ సినిమాలో నిజాయితీ గల పోలీస్ పాత్రలో బ్రిటిష్ అధికారులు చెప్పినట్టుగా ఎన్టీఆర్ చేస్తూ ఉంటారు.
అంతే కాకుండా దేశం కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ వాళ్లను కొడుతూ ఎన్టీఆర్ కనిపిస్తుంటారు. అంతే కాకుండా సినిమాలో ప్రజల నుండి బలవంతంగా పన్నులు వసూలు చేస్తూ ఎన్టీఆర్ కనిపిస్తూ ఉంటారు. మరోవైపు పరివర్తన, తోడుదొంగలు సినిమాలలో కూడా ఎన్టీఆర్ నెగిటివ్ రోల్స్ లో నటించారు. అంతే కాకుండా రాజు పేద సినిమాలో పూర్తిగా డీ గ్లామర్ పాత్రలో నటించి సంచలనం సృష్టించారు.