Home » నాగార్జునకు షాక్ …లీగల్ నోటీసులు పంపించిన సర్పంచ్…!

నాగార్జునకు షాక్ …లీగల్ నోటీసులు పంపించిన సర్పంచ్…!

by Bunty
Ad

మన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నటుడు నాగార్జున సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అనే విషయం అందరికీ తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన పరపతిని ఉపయోగించుకోలేదు. తన సొంత టాలెంట్ తోనే సినిమా రంగంలో దూసుకెళ్లారు. ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా అక్కినేని నాగార్జున కొనసాగుతున్నారు.

READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు

Advertisement

Advertisement

అయితే, తాజాగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. గోవాలో ఇంటిని నిర్మిస్తున్న అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. గోవాలోని మాడ్రెం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 211/2 Bలో నాగ్ ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ అనుమతి లేదని, ఈ నిర్మాణాలు వెంటనే ఆపాలంటూ సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసులు జారీ చేశారు.

గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణాలు ఆపకపోతే గోవా పంచాయతీరాజ్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై హీరో నాగార్జున ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవలే ముగిసింది. అయితే నాగార్జున తదుపరి సీజన్ లో కనిపించని ఇటీవల వార్తలు వచ్చాయి.

READ ALSO : ఏసుక్రీస్తు దయవల్ల కరోనా తగ్గింది : తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Visitors Are Also Reading